News October 4, 2024
ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్న Stock Markets

బెంచ్‌మార్క్ సూచీలు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అప్పటికప్పుడు పెరుగుతూ తగ్గుతూ వణుకు పుట్టిస్తున్నాయి. ఉదయం స్వల్ప నష్టాల్లో ట్రేడైన సూచీలు మధ్యాహ్నం భారీగా పుంజుకున్నాయి. 12.30PM తర్వాత మళ్లీ తగ్గాయి. 160 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ ప్రస్తుతం 26 పాయింట్ల నష్టంలో ఉంది. 800 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ -160కి వెళ్లింది. ఇంట్రాడే గరిష్ఠాల నమోదుకు ఇన్ఫీ, యాక్సిస్ బ్యాంకు షేర్లు తోడ్పడ్డాయి.
Similar News
News March 4, 2025
వారికి ప్రభుత్వ పథకాలు కట్?

AP: గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను నిలిపేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. త్వరలోనే క్యాబినెట్లో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిపాయి.
News March 4, 2025
రూ.100 కోట్ల ఆస్తి.. తల్లిని చంపేసిన కొడుకు

TG: ఆస్తి కోసం తల్లినే చంపేసిన దారుణ ఘటన సంగారెడ్డి(D) తెల్లాపూర్‌లో జరిగింది. మల్లారెడ్డి, రాధికారెడ్డి దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ మద్యానికి బానిసయ్యాడు. కోయంబత్తూరులోని డీఅడిక్షన్‌లో చేర్చినా అతనిలో మార్పు రాలేదు. తిరిగొచ్చాక రూ.100 కోట్ల విలువైన భూమిని తనకు ఇవ్వాలంటూ పేరెంట్స్‌ను వేధించేవాడు. నిన్న నిద్రిస్తున్న తల్లిని కత్తితో 9చోట్ల పొడిచి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News March 4, 2025
ఇంటి అద్దెలను ప్రభుత్వాలు నియంత్రించలేవా?

హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ సహా చాలా నగరాలు, పట్టణాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా ఉంటున్నాయి. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ల అద్దెలూ నోరెళ్లబెట్టేలానే ఉన్నాయి. నెలజీతంలో సగం ఇంటి అద్దెకే పోతోందని చిరు ఉద్యోగులు వాపోతున్నారు. నీళ్లు, ఇతర సౌకర్యాలు లేకపోయినా అద్దెలు ఆకాశాన్నే తాకుతున్నాయి. ఒక ప్రాతిపదిక అనేది లేకుండా ఓనర్లు ఇష్టారీతిన పెంచే ఈ అద్దెలను ప్రభుత్వాలు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.