News October 13, 2025

నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 271 పాయింట్లు పతనమై 82,229 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 25,209 వద్ద ట్రేడవుతున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పేయింట్స్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Similar News

News October 13, 2025

రేషన్ బియ్యాన్ని గుర్తించేలా ర్యాపిడ్ కిట్స్: నాదెండ్ల

image

AP: పీడీఎస్(రేషన్) బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఇవి రేషన్ బియ్యం అక్రమ రవాణాను గుర్తించేందుకు ఉపయోగపడుతాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న బియ్యాన్ని పరిశీలిస్తున్నామని, నిఘా విభాగం అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,65,000 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

News October 13, 2025

వంటింటి చిట్కాలు

image

* బొంబాయిహల్వా రుచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలపాలి.
* పచ్చి బటానీ ఉడికించేటప్పుడు కాస్త పంచదార వేస్తే వాటి రుచి పెరుగుతుంది.
* బనానా చిప్స్ కరకరలాడాలంటే వేయించే ముందు వాటిపై ఉప్పు నీటిని చిలకరించాలి.
* ఫ్లవర్‌వాజుల్లో నీరు మార్చినపుడు అందులో కాస్త పంచదార వేస్తే పూలు వాడిపోకుండా ఉంటాయి.
* బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండువైపులా తొడిమలు తీసేసి ప్లాస్టిక్ కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.

News October 13, 2025

జూబ్లీహిల్స్‌లో BRSకు TRSతో ముప్పేనా?

image

గతంలో పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు BRSను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్‌లో తెలంగాణ రక్షణ సమితి- డెమోక్రటిక్(TRS- D) రూపంలో ముప్పు పొంచి ఉంది. పేరు, జెండా ఒకేలా ఉండటం, ఉద్యమ పార్టీ BRSగా మారినా చాలామందికి TRSగానే గుర్తు. దీంతో TRS(D) డ్యామేజ్‌పై గులాబీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. అటు కాంగ్రెస్‌కు బలమైన పోటీ కావడంతో ప్రత్యర్థులు ఈ కుట్ర చేశారని గులాబీదళం ఆరోపిస్తోంది.