News August 6, 2024

లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. సెన్సెక్స్ 950 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 450 పాయింట్ల గ్యాప్ అప్‌తో ట్రేడింగ్‌ని ప్రారంభించాయి. సెన్సెక్స్ సోమ‌వారం 2,223 పాయింట్ల భారీ న‌ష్టాన్ని చ‌విచూసింది. ఎఫ్ఐఐలు ఒక్క రోజులోనే రూ.10 వేల కోట్ల షేర్లు అమ్మ‌గా, డీఐఐలు రూ. 9 వేల కోట్ల షేర్ల‌ను కొనుగోలు చేశారు.

Similar News

News March 4, 2026

ప్రభుత్వ పథకాలు.. అప్లికేషన్ స్టేటస్ ఇక ఈజీగా తెలుసుకోవచ్చు!

image

TG: సంక్షేమ పథకాల అప్లికేషన్ల స్టేటస్‌ను దరఖాస్తుదారులు ఈజీగా తెలుసుకునేలా ప్రభుత్వం కొత్త సాంకేతిక విధానాన్ని తీసుకొస్తోంది. దీనికోసం ప్రతి విభాగం ఈ-ఆఫీస్ ,డిజిటల్ గవర్నెన్స్‌ను అమలు చేస్తోంది. సీనియర్ IAS జయేష్ రంజన్ అధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ ఈ విధానాన్ని రూపొందిస్తోంది. 3 వారాల్లో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఆ తర్వాత కొత్త టెక్నాలజీ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

News March 4, 2026

పైల్స్ అని చూపించినా.. లీవ్ ఇవ్వలేదు!

image

లక్నో రైల్వే డివిజన్‌లో సిక్ లీవ్ కోసం ఓ లోకో పైలట్ ప్యాంట్ విప్పాల్సి రావడం హాట్ టాపిక్‌గా మారింది. పైల్స్ సర్జరీ చేయించుకున్న రాజేశ్ అనే లోకో పైలట్ రెస్ట్ కోసం లీవ్ అడగ్గా పైఅధికారి రతన్ నమ్మలేదు. తగిన మెడికల్ రిపోర్టులు చూపినా రిజెక్ట్ చేశారు. మనస్తాపంతో రాజేశ్ తన గాయాలను చూపించేందుకు ప్యాంట్ విప్పారు. అయినా అధికారి లీవ్ ఇవ్వడానికి అంగీకరించలేదు. యూనియన్ నాయకుల జోక్యంతో సెలవు మంజూరైంది.

News March 4, 2026

ఇరాన్‌కు షాహెద్.. అమెరికాకు LUCAS.. మరి భారత్‌కు?

image

ఇరాన్ ‘షాహెద్’, అమెరికా ‘LUCAS’లకు దీటుగా భారత్ శేష్‌నాగ్-150 డ్రోన్‌ను సిద్ధం చేస్తోంది. బెంగళూరులోని NRT సంస్థ అభివృద్ధి చేస్తోన్న ఈ డ్రోన్ 25-40kgల ఆయుధాలతో 1,000km దూరంలోని టార్గెట్స్‌ను రీచ్ అవుతుంది. GPS సిగ్నల్స్ లేని చోట ‘విజువల్ నావిగేషన్’తో పనిచేయడం దీని స్పెషాలిటీ. యుద్ధ క్షేత్రంలో సొంత ఇంటెలిజెన్స్‌తో నిర్ణయాలు తీసుకొని దగ్గర్లోని ఇతర డ్రోన్లతో ఇది కమ్యూనికేట్ చేయగలదు.