News August 5, 2024

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

image

అంత‌ర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఫ‌లితాల సీజ‌న్ నేప‌థ్యంలో సోమ‌వారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ న‌ష్టాలతో ఆర‌ంభ‌మ‌య్యాయి. సెన్సెక్స్ 1600, నిఫ్టీ 450పాయింట్ల‌ న‌ష్టంతో ట్రేడింగ్ సెష‌న్ ప్రారంభ‌మైంది. రెండు దేశీయ‌ సూచీలు భారీ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయ్యాయి. టాటా మోట‌ర్స్‌, హిందాల్కో, శ్రీరామ్ ఫిన్, టాటా స్టీల్ 4 నుంచి 5 శాతం న‌ష్టాల‌తో ట్రేడవుతున్నాయి.

Similar News

News December 5, 2025

మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

image

బాబ్రీ మసీదును పోలిన మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. TMC నుంచి సస్పెండైన MLA హుమాయున్ ప.బెంగాల్ ముర్షిదాబాద్(D) బెల్దంగాలో మసీదు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన DEC 6నే శంకుస్థాపనకు ముహూర్తం పెట్టుకున్నారని, స్టే ఇవ్వాలని పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన తాత్కాలిక చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తిరస్కరించింది.

News December 5, 2025

TG టెట్ పరీక్షలు వాయిదా పడతాయా?

image

TG: ఇన్‌సర్వీస్ టీచర్లూ టెట్ పాస్ కావాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. జనవరి 3 నుంచి 31 వరకు <<18427476>>టెట్<<>> జరగనుండగా ప్రిపరేషన్‌కు సమయంలేక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల విధులు, సిలబస్‌ను పూర్తి చేయడం, వీక్లీ టెస్టుల నిర్వహణలో వారు బిజీగా ఉన్నారు. ఎన్నికలు ముగిశాక పరీక్షలకు 15 రోజులే గడువు ఉంటుంది. దీంతో టెట్‌ను వాయిదా వేయాలని ఆయా సంఘాలు కోరుతున్నాయి.

News December 5, 2025

ESIC ఫరీదాబాద్‌లో ఉద్యోగాలు

image

ఫరీదాబాద్‌లోని <>ESIC<<>> మెడికల్ కాలేజీ& హాస్పిటల్ 67 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 10, 17తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, MD, MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం రూ.1,48,669 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, మహిళలు, PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in