News November 21, 2024

స్టాక్ మార్కెట్లు విలవిల: రూ.3లక్షల కోట్ల నష్టం

image

దేశీయ స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గౌతమ్ అదానీపై USలో అభియోగాలు నమోదవ్వడం, ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడం, క్రూడాయిల్ ధరలు, $ విలువ పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. సెన్సెక్స్ 77,013 (-564), నిఫ్టీ 23,320 (-200) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో రూ.3L CR సంపద ఆవిరైంది. ADANIENT, ADANIPORTS, SBI టాప్ లూజర్స్. INFY, TCS టాప్ గెయినర్స్.

Similar News

News January 29, 2025

ఉక్రెయిన్‌తో చర్చలు.. కానీ జెలన్‌స్కీతో కాదు: పుతిన్

image

ఉక్రెయిన్‌తో చర్చలకు తాము సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. కానీ ఆ దేశ అధ్యక్షుడు జెలన్‌స్కీతో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తాను చర్చలు జరపనని స్పష్టం చేశారు. ఒకవేళ జెలన్‌స్కీ చర్చలకు వస్తే నా తరఫున ఇతరులను పంపిస్తానని చెప్పారు. మార్షల్ లా సమయంలోనే ఆయన అధ్యక్ష పదవి ముగిసిందని పుతిన్ చెప్పారు. అందుకే అతడితో కలిసి చర్చల్లో కూర్చునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

News January 29, 2025

క్షీణిస్తోన్న ‘సూర్య’ ప్రభ

image

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి విఫలమయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో 14 పరుగులకే వెనుదిరిగి నిరాశ పరిచారు. గత పది టీ20ల్లో 172 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యారు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశారు. తన స్థాయికి తగ్గ ఆట ఆడటం లేదు. ఇలానే ఆడితే రోహిత్ శర్మలానే సూర్య కూడా రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తాయని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.

News January 29, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. సీఎం కీలక ఆదేశాలు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై ఉన్నత స్థాయి అధ్యయన కమిటీని సీఎం రేవంత్ నియమించారు. వారం రోజుల్లో సమగ్ర విధివిధానాలతో నివేదిక అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు సౌకర్యంగా ఇసుక విధానం ఉండాలన్నారు. తక్కువ ధరకే ఇసుక దక్కేలా అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.