News January 6, 2025

Stock Markets: ఆరంభంలో విలవిల

image

స్టాక్ మార్కెట్లు మోస్తరు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 79,141 (-83), నిఫ్టీ 23,962 (-41) వద్ద ట్రేడవుతున్నాయి. ఫియర్ ఇండెక్స్ INDIA VIX 7.38% పెరగడం ఆందోళనకరం. IT, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. TATA STEEL, KOTAK, BPCL, COALINDIA, ADANIENT టాప్ లూజర్స్.

Similar News

News September 18, 2025

మోదీకి విషెస్ జెన్యూన్ కాదన్న యూట్యూబర్‌పై విమర్శలు

image

ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు చేసిన ట్వీట్లు జెన్యూన్ కాదని యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆరోపించారు. ప్రముఖులు విష్ చేసేలా ఆయన టీమ్ ముందే వారికి ‘టూల్ కిట్’ ఇచ్చిందన్నారు. దీంతో ధ్రువ్ రాథీపై మోదీ అభిమానులు ఫైరవుతున్నారు. ట్రంప్, మెలోనీ, పుతిన్ వంటి నేతలను కూడా ఆయన టీమ్ మ్యానేజ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, కేజ్రీవాల్‌కు కూడా ‘టూల్ కిట్’ ఇచ్చారా అని కౌంటర్ ఇస్తున్నారు.

News September 18, 2025

అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

image

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.

News September 18, 2025

రాష్ట్రంలో 21 పోస్టులు

image

<>ఏపీపీఎస్సీ<<>> 21 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో డ్రాట్స్‌మెన్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, హార్టికల్చర్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్(లైబ్రరీ సైన్స్), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 8వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.370. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.