News January 31, 2025
Stock Markets: వరుసగా నాలుగోరోజూ లాభపడతాయా!

స్టాక్మార్కెట్లు ఫ్లాటుగా మొదలై రేంజుబౌండ్లో కదలాడే సూచనలు ఉన్నాయి. గిఫ్ట్నిఫ్టీ 20pts పెరగడం దీనినే సూచిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. క్రూడ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఆర్థికసర్వే, రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటమే మేలు. నిఫ్టీ 24000 బ్రేక్ చేస్తే సెంటిమెంటు మరింత బలపడతుంది. రెసిస్టెన్సీ 23,307, సపోర్టు 23,167 వద్ద ఉన్నాయి.
Similar News
News December 3, 2025
ఈ విషయం మీకు తెలుసా?

చెప్పులు, బూట్లు కొనేటప్పుడు చాలా మంది పొడవు నంబర్ను మాత్రమే చూస్తారు. అయితే షూలకు పొడవుతో పాటు వెడల్పును సూచించే ప్రత్యేక నంబర్లు (ఉదాహరణకు, B,AA, EE) కూడా ఉంటాయి. ఇది తెలియక కొందరు కొత్తవి ఇరుకుగానే ఉంటాయని భావించి మౌనంగా నొప్పిని భరిస్తుంటారు. దీనివల్ల పాదాలు, అరికాళ్ల నొప్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇకనుంచి షూ కొనే సమయంలో Width, Length చూడాలంటున్నారు. దీనికోసం పైనున్న ఫొటో చూడండి.
News December 3, 2025
మీ బ్రెయిన్ ఏ గేర్ వేసింది..?

మన మెదడు 9, 32, 66, 83 వయస్సుల్లో లెవల్ షిఫ్ట్ అవుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 0-9yrs: పరిసరాలు తెలుసుకోవడం. 9-32: పరిపక్వత దిశగా ప్రయాణం, భావోద్వేగాలు, పనితీరు, ఆలోచన శక్తి పెరుగుతాయి. గ్రాఫ్ వేస్తే.. 32Yrs పీక్ పర్ఫార్మెన్స్. 32-66: సెటిల్డ్, లిమిటేషన్స్ మెంటాల్టి. ప్రిడిక్టబుల్ థాట్స్. 66-83: మతిమరుపు, అనారోగ్యం, రిజర్వ్డ్ అవుతారు. 83- కొన్ని పనులు, ఆలోచనలే చేయగలరు.
News December 3, 2025
ఇతిహాసాలు క్విజ్ – 85 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: పాండురాజు మరణానికి గల కారణం ఏంటి?
సమాధానం: పాండురాజు వేటకు వెళ్లినప్పుడు, జింకలుగా భావించి కిందమ అనే మహామునిపై బాణం వేస్తాడు. దీంతో ఆ ముని మరణిస్తూ పాండురాజు తన భార్యతో కలిసిన తక్షణమే మరణిస్తాడని శపిస్తాడు. ఈ శాపం కారణంగా, ఒకరోజు మాద్రితో కలిసినప్పుడు పాండురాజు తక్షణమే మరణించారు. దాంతో మాద్రి సహగమనం చేసింది.
<<-se>>#Ithihasaluquiz<<>>


