News December 18, 2024

స్టాక్‌మార్కెట్లు: నిన్నటి విలవిల.. నేడూ తప్పదా?

image

స్టాక్‌మార్కెట్లు నేడూ నష్టాల్లోనే మొదలవ్వొచ్చు. గిఫ్ట్ నిఫ్టీ 67PTS మేర తగ్గడం దీనినే సూచిస్తోంది. US FED వడ్డీరేట్ల కోత నిర్ణయం కోసం వేచిచూస్తున్న ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎకానమీ, ఇన్‌ఫ్లేషన్ డేటా వచ్చేంత వరకు అనిశ్చితి తప్పకపోవచ్చు. నిన్న US, EU సూచీలన్నీ ఎరుపెక్కాయి. నేడు ఆసియా మార్కెట్లూ నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. STOCKS 2 WATCH: AXIS BANK, NATIONALUM, OBEROIRLTY, UNITDSPR, VBL

Similar News

News November 21, 2025

లిక్కర్ స్కాం నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

image

AP: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ గడువు నేటితో ముగియనుండటంతో అధికారులు విజయవాడ ACB కోర్టుకు తీసుకొచ్చారు. కాగా కోర్టు డిసెంబర్ 5 వరకు రిమాండ్‌ను పొడిగించింది. ఇదే కేసులో YCP ఎంపీ మిథున్ రెడ్డి సైతం కోర్టుకు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో హాజరయ్యేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా పడింది.

News November 21, 2025

రేవంత్ నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయరు: కేటీఆర్

image

TG: ఫార్ములా ఈ-రేసు <<18337628>>కేసులో<<>> CM రేవంత్ తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని KTR అన్నారు. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ కేసులో ఏమీ లేదని రేవంత్‌కూ తెలుసు. నేను ఏ తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్టుకూ సిద్ధమే’ అని మీడియా చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. MLA దానం నాగేందర్‌తో రాజీనామా చేయించాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని, GHMC ఎన్నికల తర్వాత ఉపఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు.

News November 21, 2025

SBI పేరిట వెబ్‌సైట్.. పైరసీ సినిమాలు ప్రత్యక్షం!

image

ఎస్బీఐ ఇన్సూరెన్స్ పేరుతో ఉన్న పోర్టల్‌లో పైరసీ సినిమాల లింకులు కనిపించడం కలకలం రేపింది. sbiterminsurance.com పేరిట ఓ పైరసీ వెబ్‌సైట్ వెలుగుచూసింది. అందులో టర్మ్ ఇన్సూరెన్స్ లాప్స్&రివైవల్ గైడ్ పేజీకి రీడైరెక్ట్ అయి సినిమాలు ప్లే అవుతున్నాయి. దీనిపై SBI టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.