News February 14, 2025
Stock Markets: భారీ లాభాల్లో మొదలవ్వొచ్చు..

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీగా లాభపడొచ్చు. గిఫ్ట్‌నిఫ్టీ 100pts లాభంతో మొదలవ్వడం దీనినే సూచిస్తోంది. అమెరికా, ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందాలు కుదరడమూ పాజిటివ్ సెంటిమెంటును నింపింది. డాలర్ ఇండెక్స్ తగ్గడం శుభపరిణామం. ఆసియా మార్కెట్ల నుంచైతే మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. నిఫ్టీ రెసిస్టెన్సీ 23,250, సపోర్టు 22,900 వద్ద ఉన్నాయి. సూచీ 23,200 పై స్థాయిలో నిలదొక్కుకుంటేనే బలం పెరిగినట్టు లెక్క.
Similar News
News November 10, 2025
6 గంటల్లోనే జీవ వ్యర్థాల నుంచి జీవ ఎరువుల తయారీ

జీవవ్యర్థ పదార్థాలను జీవ ఎరువులుగా మార్చే పరిశ్రమ త్వరలో HYDలోని ప్రొ.జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో.. వర్సిటీ ఒప్పందం చేసుకుంది. రూ.5 కోట్లతో ఈ ఎరువుల యూనిట్‌ను 2 నెలల్లోనే ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించనున్నారు. జీవవ్యర్థాల నుంచి 6 గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేయవచ్చని ‘బయోవే’ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
News November 10, 2025
విదేశాల్లో పిల్లలు.. కుమిలిపోతున్న తల్లిదండ్రులు!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం యువత విదేశాలకు వెళ్లడం సర్వసాధారణమైంది. ప్రారంభంలో ఏడాదికోసారి పిల్లల వద్దకు ఉత్సాహంగా వెళ్లే తల్లిదండ్రులు వయసు పెరిగే కొద్దీ (60+) సుదీర్ఘ ప్రయాణాలు, ఆరోగ్య సమస్యల కారణంగా వెళ్లడం మానేస్తున్నారు. అయితే ఉద్యోగాలు, వీసా సమస్యలతో పిల్లలు కూడా ఇండియాకు రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రమైన ఒంటరితనానికి లోనవుతూ కుమిలిపోతున్నారు. చివరి రోజుల్లోనూ పిల్లల ప్రేమ పొందలేకపోతున్నారు.
News November 10, 2025
డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో 32 పోస్టులు

డిజిటల్ ఇండియా కార్పొరేషన్(<


