News January 27, 2025
#stockmarketcrash: ₹9 లక్షల కోట్లు మటాష్!

గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్‌కు తోడు ChatGPTకి పోటీగా చైనా ఫ్రీగా DeepSeekను తీసుకురావడంతో స్టాక్‌మార్కెట్లు రక్తమోడుతున్నాయి. కొలంబియాపై ట్రంప్ 25% టారిఫ్స్ విధించడం, ఆసియా సూచీలు ఎరుపెక్కడంతో భారత సూచీలు కుదేలయ్యాయి. నిఫ్టీ 230, సెన్సెక్స్ 800pts పతనమవ్వడంతో ఇన్వెస్టర్లు రూ.9లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. మదుపరులు ప్రీబడ్జెట్ ర్యాలీ ఆశిస్తే మార్కెట్లేమో చుక్కలు చూపిస్తున్నాయి.
Similar News
News February 9, 2026
చంద్రుడిపై సిటీ నిర్మాణం.. పదేళ్లలోనే పూర్తి: మస్క్

చంద్రుడిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మించడంపై SpaceX దృష్టిసారించిందని, ఇది 10ఏళ్లలోనే పూర్తవుతుందని ఎలాన్ మస్క్ తెలిపారు. అంగారకుడిపై దీనికి 20+Y పడుతుందన్నారు. ‘గ్రహాలు 26 నెలలకొసారి సమాంతరంగా చేరినప్పుడే 6 నెలల్లో మార్స్‌కు ప్రయాణించగలం. 10 రోజులకోసారి 2 రోజుల్లో చంద్రుడిపైకి వెళ్లొచ్చు కాబట్టి అక్కడ సిటీని వేగంగా పూర్తిచేయగలం. భవిష్యత్తు నాగరికతను కాపాడటమే మా లక్ష్యం’ అని Xలో పేర్కొన్నారు.
News February 9, 2026
గొర్రెల మందలో విత్తన పొట్టేలు ప్రాముఖ్యత

గొర్రెల మంద పెరగాలన్నా, నాణ్యమైన పిల్ల రావాలన్నా, మందలో ప్రతీ 20-25 గొర్రెలకు మంచి విత్తన పొట్టేలును ఎంపిక చేసుకోవాలి. అది బలంగా, ఎత్తుగా ఉండాలి. చాలా మంది రైతులు తమ మందలో పుట్టిన పిల్లను విత్తనం కోసం ఎంపిక చేసుకుంటారు. దీని వల్ల నాణ్యమైన పిల్ల పుట్టకపోగా, బలహీనంగా, అంగవైకల్యంతో, తక్కువ బరువు, సంతానోత్పత్తికి పనికిరాకుండా ఉంటాయి. అందుకే వేరే మంద నుంచి నాణ్యమైన పొట్టేలును ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
News February 9, 2026
డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే లోన్

AP: డ్వాక్రా సంఘాల కోసం ఏర్పాటు చేసిన ‘స్త్రీ నిధి’ పథకాన్ని డిజిటల్ విధానంలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైక్రో ఫైనాన్స్ బారిన పడకుండా దరఖాస్తు చేసుకున్న మహిళలకు 48 గంటల్లో లోన్ అందేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. అలాగే ఒక్కో స్వయం సహాయక సంఘానికి ఇస్తున్న రూ.5 లక్షల లోన్‌ను రూ.8 లక్షలకు పెంచింది.


