News April 19, 2024

రాయి దాడి కేసు.. నిందితుడి వాంగ్మూలం కోసం పిటిషన్

image

AP: సీఎం జగన్‌పై రాయి దాడి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జడ్జి సమక్షంలో నిందితుడు సతీశ్ వాంగ్మూలాన్ని తీసుకునేందుకు అనుమతి కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా నిన్న సతీశ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతడిని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు.

Similar News

News November 20, 2025

PDPL: ‘ఓటర్ జాబితా ఫిర్యాదులు 22లోపు పరిష్కరించాలి’

image

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. 3 విడతల్లో ఎన్నికలు, మండలవారీ ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఓటర్ జాబితా ఫిర్యాదులను నవంబర్ 22లోపు పరిష్కరించాలి అని సూచించారు. నవంబర్ 23న పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితా ప్రచురించాలన్నారు. ఎంసీసీ నిబంధనలు పాటించాలన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.

News November 20, 2025

AP న్యూస్ రౌండప్

image

*రైతుల నుంచి ప్రతి ధాన్యం బస్తా కొంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్
*బిహార్ CM నితీశ్ కుమార్‌కు YS జగన్ శుభాకాంక్షలు
*గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలకృష్ణకు సత్కారం
*డిసెంబర్ 15 నుంచి అమరావతి రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో సరిహద్దుల్లేని ప్లాట్లకు కొత్త పెగ్ మార్క్‌లు వేసే ప్రక్రియ ప్రారంభం
*2026లో రిటైర్ కానున్న ఐదుగురు IAS అధికారులను నోటిఫై చేసిన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్

News November 20, 2025

ఢిల్లీకి డీకే శివకుమార్.. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం

image

కర్ణాటకలో CM మార్పు ప్రచారం మరోసారి జోరందుకుంది. Dy.CM డీకే శివకుమార్ మరికొంత మంది MLAలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. KAలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో రెండున్నరేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ‘పవర్ షేరింగ్’ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆయన ఢిల్లీ బాటపట్టారని చర్చ జరుగుతోంది. ఇవాళ రాత్రికి ఖర్గేతో, రేపు KC వేణుగోపాల్‌తో DK వర్గం భేటీ కానుంది. దీంతో సీఎం మార్పుపై ఉత్కంఠ నెలకొంది.