News November 23, 2024

చంద్రబాబుపై రాళ్ల దాడి.. నిందితుల అరెస్ట్

image

AP: రెండేళ్ల క్రితం సీఎం చంద్రబాబుపై రాళ్ల దాడి చేసిన నిందితులను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. నిందితులను కనికంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్‌గా గుర్తించారు. కాగా 2022 నవంబర్ 5న చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పర్యటించారు. రోడ్ షో చేస్తున్న సమయంలో లైట్లు ఆర్పేసి చంద్రబాబుపై కొందరు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు గాయాలయ్యాయి.

Similar News

News November 2, 2025

NHIDCLలో 34 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(<>NHIDCL<<>>)లో 34 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీటెక్/బీఈ, గేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 34ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ. 50000 నుంచి రూ.1,60,000 అందుతుంది. వెబ్‌సైట్: https://www.nhidcl.com/

News November 2, 2025

దారుణం.. ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య

image

TG: వికారాబాద్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుల్కచర్లలో చోటు చేసుకుంది. భార్య, కుమార్తె, వదినను గొంతు కోసి చంపిన వేపూరి యాదయ్య అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో కూతురుపైనా దాడి చేయగా ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పరిగి డీఎస్పీ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 2, 2025

గేదెను కొనేటప్పుడు ఇవి తప్పక తెలుసుకోండి

image

గేదెను కొనుగోలు చేసేటప్పుడు అది ఎప్పుడు ఈనింది, ఎన్నవ ఈతలో ఉంది, ఈనిన తర్వాత ఎన్ని నెలలు పాడిలో ఉంది, కట్టినట్లయితే ఎన్ని నెలలు గర్భంలో ఉంది, వట్టి పోయి ఎంతకాలమైంది, ఈనడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది అనే విషయాలను తప్పకుండా యజమానిని అడిగి తెలుసుకోవాలి. సంతలో పశువులను కొనుగోలు చేయాలనుకుంటే వాటికి రంగులు వేశారా? కొమ్ములు చెక్కారా? వంటివి గమనించి కొనాలి. పొదుగు జబ్బు వచ్చిన గేదెలు కొనకూడదు.