News November 19, 2024
మాజీ హోంమంత్రిపై రాళ్ల దాడి.. తలకు గాయాలు

మహారాష్ట్ర మాజీ హోమ్ మినిస్టర్, NCP-SP నేత అనిల్ దేశ్‌ముఖ్‌పై రాళ్ల దాడి జరిగింది. కటోల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న తన కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్ తరఫున ప్రచారం నిర్వహించి తిరిగి వస్తుండగా ఆయన కారుపై దుండగులు రాళ్లు విసిరారు. దీంతో ఆయన తలకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<
News November 18, 2025
తిరుమల వైభవాన్ని చాటే మహాద్వార గోపురం

శ్రీవారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారమే మహద్వార గోపురం. దీన్నే ముఖద్వారం, పడికావలి గోపురమని కూడా అంటారు. సుమారు 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోపురం 50ft ఎత్తుతో, 5 అంతస్తులతో ఉంటుంది. దీని శిఖరంపై 7 కలశాలు అలరారుతుంటాయి. మహాప్రాకారానికి తొలి ప్రవేశ ద్వారం ఇదే. అద్భుతమైన ఈ శిల్పకళా రూపం, భక్తులకు స్వామి దర్శనానికి ముందు ఆధ్యాత్మిక అనుభూతిని అందించి, ఆలయ దివ్య వైభవానికి అద్దం పడుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<


