News October 3, 2024
గడియారం గుర్తును వాడకుండా అజిత్ను అడ్డుకోండి: శరద్ పవార్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ ఆధ్వర్యంలోని NCP గడియారం గుర్తును ఉపయోగించకుండా అడ్డుకోవాలంటూ శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. NCP SP, NCPల గుర్తుల విషయంలో ఇప్పటికీ ప్రజల్లో అయోమయం నెలకొందని పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికల కోసం గడియారం గుర్తు వాడుకోకుండా అజిత్ వర్గాన్ని అడ్డుకోవాలని కోరారు. గతంలో పార్టీ చీలికతో మెజారిటీ MLAలు అజిత్ వైపు ఉండడంతో గుర్తు ఆయనకే దక్కింది.
Similar News
News December 25, 2025
ఇంటర్ సెకండియర్ HTపై ఫస్టియర్ మార్కులు

TG: ఇంటర్ సెకండియర్ పరీక్షల హాల్టికెట్పై ఇక నుంచి ఫస్టియర్ మార్కులు, పాస్/ఫెయిల్ వివరాలను విద్యాశాఖ ముద్రించనుంది. కొందరు విద్యార్థులు ఫస్టియర్ మార్కులు తక్కువొచ్చినా, సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినా పేరెంట్స్కు చెప్పట్లేదు. రెండో ఏడాది చివర్లో ఇది తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనికి చెక్ పెట్టడంతో పాటు విద్యార్థుల్లో జవాబుదారీతనం కోసం ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.
News December 25, 2025
నైతిక రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం!

దేశంలో నైతిక రాజకీయాలకు విలువ తెచ్చిన అజాతశత్రువు అటల్ బిహారి వాజ్ పేయి. ఒక్క ఓటుతో ప్రధాని పీఠం చేజారుతున్నా ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడని వ్యక్తిత్వం ఆయనది. 6 దశాబ్దాల రాజకీయ జీవితంలో హాస్య చతురత మేళవించిన ప్రసంగాలు, ఆవేశపూరిత ఉపన్యాసాలకు ఆయన పెట్టింది పేరు. రోడ్లతో పాటు ఎయిర్, రైల్, టెలీ, షిప్ కనెక్టివిటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ‘భారతరత్న’ అయ్యారు. ఇవాళ వాజ్పేయి జయంతి.
News December 25, 2025
ధనుర్మాసం: పదో రోజు కీర్తన

యోగనిద్రలో ఉన్న ఐదో గోపికను ఇతర గోపికలు ఇలా మేల్కొల్పుతున్నారు. ‘ఓ అమ్మా! తలుపు తీయకపోయినా పర్వాలేదు. కనీసం మా మాటలకు సమాధానమైనా ఇవ్వు. జ్ఞానుల మాటలు వినడం ఎంతో పుణ్యం. పరిమళభరిత తులసిమాలలు ధరించే నారాయణుడు మన వ్రతానికి ఫలితాన్నిస్తాడు. రాముడి చేతిలో హతుడైన కుంభకర్ణుడు తన నిద్రను నీకేమైనా ఇచ్చాడా? ఆలస్యం చేయక నిద్ర వీడి, మాతో కలిసి వ్రతాన్ని పూర్తి చేయి’ అని వేడుకుంటున్నారు. <<-se>>#DHANURMASAM<<>>


