News June 21, 2024

నన్ను దురదృష్టవంతురాలు అనడం మానేయండి: రేణూ దేశాయ్

image

భర్త వదిలేశారని తనను దురదృష్టవంతురాలిగా పేర్కొనడం ఎంతో బాధిస్తోందని నటి రేణూ దేశాయ్ అన్నారు. అందంగా ఉండి, మంచి పిల్లలు ఉన్నప్పటికీ మీరు అన్‌లక్కీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నాతో ఉన్నవాటితో నేను సంతోషంగా ఉన్నా. లేనివాటి గురించి బాధలేదు. విడాకులు తీసుకున్న వారిపై, వితంతువులపై ఇలాంటి కామెంట్స్ సరికాదు. వ్యక్తిత్వం, ప్రతిభను బట్టి వారితో ప్రవర్తించాలి’ అని రిప్లై ఇచ్చారు.

Similar News

News December 4, 2025

తొక్కిసలాటకు ఏడాది.. దయనీయస్థితిలో శ్రీతేజ్

image

గతేడాది Dec 4 రాత్రి ‘పుష్ప-2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన <<14796361>>తొక్కిసలాటలో<<>> గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి ఏడాదైనా దయనీయంగానే ఉంది. తానంతట తాను అన్నం తినలేని స్థితిలో ఉలుకూపలుకూ లేకుండా పడి ఉంటున్నాడు. ఎవరినీ గుర్తుపట్టలేక పోతున్నాడు. అతడికి చికిత్స ఇప్పించేందుకు నెలకు రూ.1.50 లక్షలు ఖర్చవుతున్నాయని, అల్లు అర్జున్ మేనేజర్‌ను సంప్రదిస్తే సానుకూల స్పందన లేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు.

News December 4, 2025

పూజల్లో అరటి పండు ప్రాధాన్యత

image

పూజలు, వ్రతాలు, శుభకార్యాల్లో అరటికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, ఇతర పండ్లలాగా దీనికి ఎంగిలి ఉండదు. అదెలా అంటారా? దాదాపు అన్ని చెట్లు వాటి గింజల నుంచి మొలుస్తాయి. ఆ గింజలను మనం ఎంగిలిగా భావిస్తాం. కానీ, అరటి అలా కాదు. ఇది మొక్కల ద్వారానే వృద్ధి చెందుతుంది. అందుకే దీన్ని పూర్ణఫలంగా, పవిత్రమైనదిగా దేవుడికి నివేదిస్తారు. పండ్లను, ఆకులను.. ఇలా ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని పూజకు వాడుతారు.

News December 4, 2025

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన 1,146 అకడమిక్ ఇన్‌స్ట్రక్చర్లను భర్తీ చేయనున్నారు. వీటిలో 892 సబ్జెక్ట్ టీచర్లు, 254 SGT పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. 7వ తేదీ లోపు ఎంపిక చేపడుతారు. అభ్యర్థులు డిసెంబర్ 8 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ టీచర్‌కు నెలకు రూ.12,500, SGTలకు రూ.10వేలు చెల్లిస్తారు.