News June 12, 2024
చంద్రబాబు గారూ దాడులను ఆపండి: షర్మిల

AP: సీఎం చంద్రబాబుకు ఏపీసీసీ చీఫ్ YS షర్మిల బహిరంగ లేఖ రాశారు. ‘సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మీకు శుభాకాంక్షలు. ఐదేళ్ల విధ్వంస పాలనను గాడిలో పెట్టేందుకు ప్రజలు అధికారమిచ్చారు. వారం రోజులుగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్ విగ్రహాలపై జరుగుతున్న దాడులు నన్ను కలచివేశాయి. మీ అనుభవంతో పరిస్థితులను చక్కదిద్ది ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నా’ అని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News September 14, 2025
కొడుకును చంపి నదిలో పడేశాడు!

TG: హైదరాబాద్ బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు అనాస్(3)ను తండ్రి అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీ నదిలో పడేశాడు. అనంతరం బాలుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.
News September 14, 2025
సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు

AP: సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దైంది. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఏవియేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ వస్తే సీఎం తిరుపతి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఇవాళ సీఎం పాల్గొనాల్సి ఉంది.
News September 14, 2025
స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో జాబ్‌లు

<