News July 20, 2024
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతా: ట్రంప్

తాను ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టగానే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడినట్లు ట్వీట్ చేశారు. ‘నేను అధికారంలో ఉండి ఉంటే అసలు ఈ యుద్ధం జరిగేది కాదు. చర్చల ద్వారా యుద్ధాన్ని ముగించి, ప్రపంచ శాంతికి కృషి చేస్తా’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు జెలెన్స్కీ కూడా ఈ ఫోన్ కాల్ గురించి ట్వీట్ చేశారు.
Similar News
News November 22, 2025
ఏలూరు: అప్డేట్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థులు ఎదురుచూపులు

ట్రైనింగ్‌పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్‌పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
News November 22, 2025
‘నక్క’ బుద్ధి చూపించింది!.. భారతీయుల ఆగ్రహం

ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ క్రికెట్ ఛానల్‌పై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో మ్యాచ్ అయితే ఒకలా, ఆస్ట్రేలియాలో అయితే మరోలా మాట్లాడుతోందని అంటున్నారు. యాషెస్ టెస్టులో తొలి రోజు 19 వికెట్లు పడ్డాయంటూ గొప్పగా రాసుకొచ్చింది. అయితే ఇటీవల INDvsSA టెస్టు మ్యాచ్‌లో ఒకేరోజు 15 వికెట్లు పడటంపై “RIP TEST CRICKET” అంటూ పేర్కొంది. దీంతో ‘నక్క’ బుద్ధి చూపిస్తోందని ట్రోల్ చేస్తున్నారు.
News November 22, 2025
AP న్యూస్ అప్డేట్స్

* విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 308 ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం(ఎకరాకు రూ.20లక్షలు) అందజేయనుంది.
* రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల రక్షణకు కేంద్రం రూ.39.84 కోట్లను విడుదల చేసింది.
* అక్రమాస్తుల కేసులో APMSIDC జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు 27 చోట్ల స్థలాలు, ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు.


