News July 16, 2024
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపండి: భారత్‌కు అమెరికా విజ్ఞప్తి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేలా చర్యలు తీసుకోవాలని భారత్‌కు అమెరికా విజ్ఞప్తి చేసింది. ఇరు దేశాల మధ్య శాశ్వత పరిష్కారం లభించేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాలని కోరింది. భారత్-రష్యా బంధం సుదీర్ఘమైనదని అమెరికా పేర్కొంది. కాగా దాదాపు రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా తరఫున సుమారు 50 వేల మందికిపైగా, ఉక్రెయిన్ తరఫున దాదాపు 31 వేల మందికిపైగా మరణించినట్లు తెలుస్తోంది.
Similar News
News November 20, 2025
ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి

TG: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తయింది. ఆయన తన నిర్ణయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 10 మందిలో తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, డా.సంజయ్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య విచారణకు హాజరయ్యారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి హాజరుకాలేదు.
News November 20, 2025
బండి సంజయ్‌పై పేపర్ లీకేజీ కేసు కొట్టివేత

TG: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై దాఖలైన టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసును హైకోర్టు కొట్టేసింది. 2023లో పదో తరగతి హిందీ పేపర్ లీకేజీకి కారణమంటూ కమలాపూర్ PSలో ఆయనపై కేసు నమోదైంది. దీనిపై ఆయన HCని ఆశ్రయించగా సరైన సెక్షన్లు, ఆధారాలు లేవంటూ తాజాగా కేసును క్వాష్ చేసింది. మరోవైపు 2023 ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారంటూ మాజీ మంత్రి KTR, గోరటి వెంకన్నపై దాఖలైన FIRనూ HC కొట్టివేసింది.
News November 20, 2025
ఇతిహాసాలు క్విజ్ – 72 సమాధానాలు

నేటి ప్రశ్న: కురుక్షేత్రంలో కర్ణుడి రథ చక్రం నేలలో కూరుకు పోవడానికి, అది బయటకు రాకపోవడానికి కారణం ఏంటి?
జవాబు: ఓసారి కర్ణుడు భూమిపై పడిన నెయ్యిని తీస్తూ నెయ్యి తడిసిన మట్టిని చేతులతో బలంగా పిండాడు. ఈ చర్యతో బాధపడిన భూమాత ఆగ్రహించింది. ‘నువ్వు నాకు ఈ బాధకు కలిగించినందుకు ప్రతిచర్యగా నీ జీవితంలో అతి కీలకమైన యుద్ధ సమయంలో నీ రథ చక్రాన్ని నేలలో బలంగా పట్టుకుంటాను’ అని శపించింది.
<<-se>>#Ithihasaluquiz<<>>


