News September 27, 2024
లక్ష్యం నెరవేరేవరకూ దాడులు ఆపం: నెతన్యాహు

తమ లక్ష్యం నెరవేరే వరకూ హెజ్బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఘర్షణ ఆపేందుకు US ప్రతిపాదించిన 21 రోజుల కాల్పుల విరమణను ఆయన తిరస్కరించారు. ఉత్తర ఇజ్రాయెల్ను ఖాళీ చేసిన ప్రజలు తిరిగి వారి స్థానానికి తీసుకొస్తామని చెప్పారు. కాగా సిరియా-లెబనాన్ సరిహద్దులోని బాల్బెక్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్పై జరిపిన దాడిలో 23మంది మరణించారు.
Similar News
News December 12, 2025
‘పత్తిలో 18% తేమ ఉన్నా కొనుగోలు చేయాలి’

సీసీఐ తేమ నిబంధనలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వాటిని సడలించాలని.. TDP MP లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. లోక్సభ జీరో అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘పత్తిలో తేమ 8-12% మించకూడదని CCI నిబంధనలున్నాయి. దీన్ని సడలించి 18% తేమ ఉన్నా కొనుగోలు చేయాలి. అలాగే వర్షంలో తడిచినా, రంగుమారిన పత్తిని ప్రత్యేక కేటగిరీ కింద తగిన ధరకు కొనుగోలు చేయాలి’ అని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
News December 12, 2025
మునగాకుతో ఎన్నో లాభాలు

ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. NCBI నివేదిక ప్రకారం.. మునగ ఆకుల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.
News December 12, 2025
తండ్రయిన టాలీవుడ్ యంగ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తండ్రయ్యారు. ఆయన భార్య కల్పనారావు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తిరువీర్ తన ఆనందాన్ని X వేదికగా పంచుకున్నారు. ‘నాయినొచ్చిండు ❤️’ అంటూ బిడ్డ చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేయగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘మసూద’, ‘పలాస 1978’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన తిరువీర్.. కల్పనారావును 2024లో వివాహం చేసుకున్నారు.


