News March 8, 2025

గ్రూప్స్ ఫలితాలు నిలిపివేయండి.. సీఎంకు మందకృష్ణ లేఖ

image

TG: SC వర్గీకరణ జరిగే వరకూ అన్ని రకాల ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని CM రేవంత్‌కు మందకృష్ణ మాదిగ లేఖ రాశారు. ‘SC వర్గీకరణను అమలు చేస్తామని, గతంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లకూ వర్తింపజేస్తామని చెప్పారు. ఈనెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో SC వర్గీకరణ చట్టం చేస్తామని చెప్పి, మరోవైపు గ్రూప్-1, 2, 3 ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఇలా చేస్తే మాదిగలు నష్టపోతారు’ అని పేర్కొన్నారు.

Similar News

News March 30, 2026

HYD: ఆంకోవీ చేపల నూనెతో BPకి చెక్

image

OU ప్రొఫెసర్ సందీప్త సూక్ష్మజీవ శాస్త్రంలో కీలక పరిశోధనలు చేశారు. చేప నూనెలో రక్తపోటును తగ్గించే ప్రత్యేక పెప్టైడ్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ పరిశోధనకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్ నుంచి పేటెంట్ ధ్రువీకరణ లభించినట్లు తెలపారు. ముఖ్యంగా ఆంకోవీ చేపల్లోని అమైనో ఆమ్లాలను వినియోగించడం ద్వారా రక్తపోటును నియంత్రించోచ్చని రుజువు చేశామని స్పష్టం చేశారు.

News March 30, 2026

‘108’ సంఖ్య విశిష్టత గురించి తెలుసా?

image

ధర్మశాస్త్రాల ప్రకారం.. మానవుడి శరీరంలో 108 ముఖ్యమైన నరాలు, మెదడులో 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతారు. వీటన్నింటినీ ఉత్తేజితం చేయడానికి ఓ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలని సూచిస్తారు. ఇలా చేస్తే మంత్రంలోని శక్తి ఈ కేంద్రాలన్నింటికీ ప్రసరించి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలం వస్తుందని నమ్మకం. పగడాల మాలతో జపం చేస్తే.. వేయింతల ఫలం, రత్నమాలతో చేస్తే పదివేల రెట్ల ఫలం వస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.

News March 30, 2026

మీది పొడిచర్మమా? అయితే ఇలా చేయండి

image

బాడీలో సెబాషియన్ గ్రంధుల ద్వారా కొన్ని జిడ్డు పదార్థాలు తక్కువగా ప్రొడ్యూస్ అయినపుడు చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటుంది. దాన్నే డ్రై స్కిన్ టైప్ అంటున్నారు నిపుణులు. ఈ టైప్ స్కిన్‌కి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. ఇన్‌ఫెక్షన్లు సోకితే ముక్కు, కనుబొమ్మల చుట్టూ దద్దుర్లు వస్తాయి. అందుకే నిపుణుల సూచనలతో సున్నితమైన క్లెన్సర్&హ్యూమెక్టెంట్స్ ఉండే మాయిశ్చరైజర్‌ని వాడితే చర్మం తేమగా, తాజాగా ఉంటుందంటున్నారు.