News August 20, 2025
కేబుల్, ఇంటర్నెట్ వైర్ల తొలగింపునకు బ్రేక్!

HYDలో కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను ప్రభుత్వం <<17454341>>తొలగిస్తున్న<<>> విషయం తెలిసిందే. దీనిపై కేబుల్ ఆపరేటర్లు TG SPDCL CMDతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కేబుల్, ఇంటర్నెట్ వైర్లను కట్ చేయొద్దని TG SPDCL నిర్ణయం తీసుకున్నట్లు ఆపరేటర్లు తెలిపారు. నిరుపయోగంగా ఉన్న వైర్లను తొలగించాలని, రన్నింగ్‌లో ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను ఒకే బంచింగ్ విధానంలో తీసుకురావాలని CMD సూచించారని పేర్కొన్నారు.
Similar News
News April 8, 2026
‘స్థాన బలం’ ఎంత గొప్పదంటే?

నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బైట కుక్క చేత భంగ పడును
స్థానబల్మిగాని తన బల్మిగాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: నీళ్లలో ఉన్న చిన్న మొసలి కూడా పెద్ద ఏనుగునైనా నీటిలోకి లాగగలదు. కానీ అదే మొసలి నీటి నుంచి బయటకి వస్తే కుక్కకు కూడా భయపడుతుంది. మొసలికి ఆ బలము స్థానం వలన వచ్చిందే కానీ సొంత బలం కాదు. ఉన్న ప్రదేశాన్ని బట్టి కూడా వ్యక్తుల బలాబలాలు ఆధారపడి ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>
News April 8, 2026
IPL: గిల్ రీఎంట్రీ.. GT బోణీ కొడుతుందా?

ఐపీఎల్‌లో ఈరోజు ఢిల్లీ వేదికగా DC, GT రా.7.30 గంటలకు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో DC ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి ఫామ్‌లో ఉండగా, GT ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. దీంతో ఈరోజైనా గెలిచి ఆ జట్టు బోణీ కొడుతుందేమో చూడాలి. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 7 సార్లు తలపడగా, GT 4 విజయాలతో పైచేయి సాధించింది. కండరాల నొప్పితో గత మ్యాచ్‌కు దూరమైన గుజరాత్ కెప్టెన్ గిల్ ఈ మ్యాచులో ఆడనున్నారు.
News April 8, 2026
ఇరాన్‌కు డెడ్‌లైన్ గడువును పొడిగించిన ట్రంప్

ఇరాన్‌కు విధించిన డెడ్‌లైన్ గడువును 2 వారాలపాటు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. <<19594813>>పాక్ అభ్యర్థన<<>> మేరకు 14 రోజులపాటు దాడులు నిలిపివేసేందుకు అంగీకరించానన్నారు. ‘హార్ముజ్‌ను వెంటనే తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందన్న షరతుకు లోబడి దీనికి నేను ఒప్పుకున్నా. ఈ సీజ్‌ఫైర్ ఇరువైపులా వర్తిస్తుంది. ఇరాన్ 10 పాయింట్ల ప్రపోజల్ అందింది. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.


