News May 16, 2024
అల్లర్లు అరికట్టండి.. CS, DGPకి హైకోర్టు ఆదేశం

AP: పోలింగ్ రోజు(మే 13), ఆ తర్వాత పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి సహా పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాడులను అదుపు చేయడంలో సీఎస్, డీజీపీ విఫలమయ్యారని పిటిషనర్ పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి వెంటనే అల్లర్లను అరికట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సీఎస్, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి నోటీసులు జారీ చేశారు.
Similar News
News February 9, 2026
అమరావతిలో క్వాంటం కంప్యూటర్ల తయారీ: సీఎం

AP: రాష్ట్రంలో ఏఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెను మార్పులు జరుగుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కలెక్టర్లతో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ‘అమరావతిలో రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు తయారవుతాయి. మనమే వాటిని ప్రపంచానికి అందిస్తాం. ప్రపంచం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వైపు మళ్లుతోంది. మనమూ ఆ దిశగా అడుగులు వేయాలి. అధికారులు నెలవారీగా సమీక్షలు చేసుకోవాలి’ అని సూచించారు.
News February 9, 2026
నాలుక మీద పుట్టుమచ్చ ఉంటే వారు చెప్పింది నిజమవుతుందా?

నాలుకపై పుట్టుమచ్చ ఉన్నవారు ఏది చెబితే అది నిజం అవుతుందని చాలామంది నమ్ముతారు. అయితే ఇలా ఉండటం ఓ దైవిక సంకేతమని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. వీరు గత జన్మలో చేసిన పుణ్యాల వల్ల ఈ గుర్తులు వస్తాయట. అలాగే మృదు స్వభావులై ఉంటారట. సైన్స్ పరంగా.. ఇవి కేవలం మెలనిన్ కణాల కూర్పు మాత్రమే. వారు బాధలో అన్న మాటలు నిజమవుతాయనే నమ్మకం వెనుకున్న అసలు ఉద్దేశం.. మానసికంగా ఇబ్బంది పెట్టకుండా గౌరవించడమే.
News February 9, 2026
వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని ఎలా గుర్తించాలి?

వరి పంట అక్కడక్కడ గుంపులు గుంపులుగా పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతోంది. సల్ఫైడ్ (గంధకం) దుష్ప్రభావమే దీనికి కారణం. సల్ఫైడ్ దుష్ప్రభావమున్న నేల బాగా మెత్తగా ఉండి, పొలంలో నడుస్తుంటే కాలు చాలా లోతుగా దిగబడి, గాలి బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది. నేల నుంచి దుర్వాసన రావడంతో పాటు మొక్కను వేర్లతో బయటకు తీస్తే కుళ్లిన కోడిగుడ్ల వాసన వస్తుంది. ఈ సమస్య తీవ్రమైతే మొక్కలు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది.


