News October 6, 2024
జానీ మాస్టర్ అవార్డును ఆపడం మూర్ఖత్వమే: నటుడు

పోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో జానీ మాస్టర్కు దక్కిన నేషనల్ అవార్డును తాత్కాలికంగా నిలిపివేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ నిర్ణయాన్ని నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ ఖండించారు. ‘కేసు రుజువయ్యేవరకు జాతీయ అవార్డు ఇవ్వడం ఆపారు. మీరేమి పద్మభూషణ్, భారతరత్న ఇవ్వట్లేదు కదా. తన కొరియోగ్రఫీ టాలెంట్కు, తన వ్యక్తిగత జీవితంతో సంబంధం ఏంటి? ఇది మూర్ఖత్వమే. సారీ’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 10, 2025
ఇప్పటికీ జీవించి ఉన్న సప్త చిరంజీవులు

1. శివానుగ్రహంతో అమరుడైన ద్రోణుని పుత్రుడు ‘అశ్వత్థామ’.
2. దయగల అసుర రాజు ‘మహా బలి చక్రవర్తి’.
3. మహాభారత రచయిత ‘వేద వ్యాసుడు’.
4. రామ భక్తుడైన ‘హనుమంతుడు’.
5. లంక రాజు, ధర్మ పరిరక్షకుడిగా భావించే ‘విభీషణుడు’.
6. మహాభారతంలో వీరుడు ‘కృపాచార్యుడు’.
7. దశావతారాల్లో ఒకరైన ‘పరశురాముడు’
News October 10, 2025
నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం (M) ఈదగాలిలో నందగోకులం లైఫ్ స్కూలును ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి స్టూడెంట్స్తో ముచ్చటిస్తారు. ఆ తర్వాత సమీపంలోని గోశాలకు వెళ్లి నంది పవర్ ట్రెడ్ మిల్, నందగోకులం సేవ్ ది బుల్ ప్రాజెక్టులతో పాటు విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభిస్తారు.
News October 10, 2025
రూ.10,896 కోట్లతో హ్యామ్ రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి

TG: వచ్చే మూడేళ్లలో రోడ్లన్నీ అద్దాల్లా మెరుస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో రూ.10,896 కోట్లతో 5,587kms మేర హ్యామ్ రోడ్లను వేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్, జిల్లా కేంద్రాల నుంచి HYDకు 4 లేన్ రోడ్లు వేస్తామని, యాక్సిడెంట్ ఫ్రీ రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టామని చెప్పారు.