News October 22, 2024

బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి, రేపటికి తుఫాన్‌గా మారనుంది. ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ గురువారం తీవ్ర తుఫాన్‌గా బలపడుతుంది, ఆ తర్వాత ఒడిశాలోని పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

Similar News

News October 22, 2024

ఎన్ఐసీకి ధరణి బాధ్యతలు

image

TG: ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల వరకు పర్యవేక్షించిన గ్రూప్ క్వాంటెలాను ప్రభుత్వం పక్కన పెట్టింది. తక్కువ వ్యయంతో నిర్వహణకు ముందుకు రావడంతో ఎన్ఐసీకి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. NIC మూడేళ్ల పాటు నిర్వహణ చూడనుంది.

News October 22, 2024

ఝార్ఖండ్ ఎలక్షన్స్: BJPలో అసంతృప్తి సెగలు

image

ఝార్ఖండ్ BJPలో అసంతృప్తి జ్వాలలు లేచాయి. ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లకు ఎక్కువ టికెట్లు ఇచ్చారని ముగ్గురు మాజీ MLAలు సహా కొందరు నేతలు అధికార JMMలో చేరారు. 66 మందితో BJP తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో మాజీ CM చంపై సోరెన్, బాబులాల్ సోరెన్ సహా సగానికి పైగా వలస నేతలే ఉన్నారు. అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు పెద్ద పార్టీలకు ఇలాంటివి సహజమేనని పోల్స్ కో ఇన్‌ఛార్జ్ హిమంత బిశ్వశర్మ అన్నారు.

News October 22, 2024

15 రోజుల్లో డ్రోన్ పాలసీ: CBN

image

AP: విజయవాడ వరద సాయంలో డ్రోన్లు కీలకంగా వ్యవహరించాయని సీఎం చంద్రబాబు అన్నారు. రానున్న రోజుల్లో అమరావతి డ్రోన్ సిటీగా మారనుందని చెప్పారు. డ్రోన్ల ఆవిష్కరణలో దేశానికి ఏపీ కేంద్రం కానుందని పేర్కొన్నారు. దీని కోసం 15 రోజుల్లో డ్రోన్ పాలసీని తీసుకొస్తామన్నారు. డ్రోన్ హబ్ ఏర్పాటుకు ఓర్వకల్లులో 300 ఎకరాల భూమిని ఇస్తామన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్నారు.