News October 25, 2025
దూసుకొస్తున్న తుఫాన్.. ఆ జిల్లాల్లో 2 రోజులు సెలవులు?

AP: రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ఇదే బలమైన తుఫాన్ అని, ఈ నెల 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందన్నారు. 26 నుంచి 4 రోజుల పాటు ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా 28, 29 తేదీల్లో తీర ప్రాంత జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని అధికారులు సూచించారు. నేడు, రేపు చాలాచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.
Similar News
News October 25, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ నేతలతో కీలక భేటీ
* మద్యం దుకాణాల టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్
* త్వరలోనే 14,000 అంగన్‌వాడీ హెల్పర్ల నియామకం
* కర్నూల్ బస్సు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రైవేటు బస్సుల్లో ముమ్మర తనిఖీలు
* హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కొనసాగుతున్న వర్షాలు
News October 25, 2025
మర్రి చెట్టును ఎందుకు పూజించాలి?

మర్రిచెట్టు జ్ఞానం, పవిత్రత, సౌభాగ్యానికి నిదర్శనం. దీన్నే వట వృక్షం అని అంటారు. మహా ప్రళయం తర్వాత విష్ణుమూర్తి శిశువుగా ఈ చెట్టు ఆకుపై శయనించడం వల్లే ఆయనకు ‘వటపత్రశాయి’ అనే నామం వచ్చింది. కైలాసంలో శివుడు ఈ వృక్షం నీడనే నివసిస్తాడని చెబుతారు. స్త్రీలు తమ వైవాహిక సౌభాగ్యం కోసం ఈ చెట్టును పూజించి, జ్యేష్ఠ పౌర్ణమిన ‘వటసావిత్రీ వ్రతం’ ఆచరిస్తారు. దీని కింద రుషులు ధ్యానం చేసి, విశ్రాంతి తీసుకుంటారు.
News October 25, 2025
కర్నూలు బస్సు ప్రమాదం.. కారణం ఇదే

AP: కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీని పోలీసులు ఛేదించారు. శివశంకర్ మిత్రుడు ఎర్రిస్వామిని విచారించి కీలక విషయాలు వెల్లడించారు. ‘బంక్‌లో పెట్రోలు పోయించాక బండిని శివశంకర్ నడిపాడు. బైక్ స్కిడ్ అయ్యి కుడివైపు డివైడర్‌ను ఢీకొట్టింది. శివశంకర్ స్పాట్‌లో చనిపోయాడు. దీంతో గాయపడ్డ ఎర్రిస్వామి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రోడ్డుపై ఉన్న బైక్‌ని బస్సు ఈడ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగింది’ అని తెలిపారు.


