News October 29, 2025

తుఫాన్.. ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు

image

AP: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలు, మత్స్యకారులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. ప్రతి కుటుంబానికి 25కేజీల బియ్యం(మత్స్యకారులకు 50కేజీలు), లీటర్ నూనె, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెర అందించనుంది. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా వెంటనే ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేయాలని మార్కెటింగ్ కమిషనర్‌కు సూచించింది.

Similar News

News October 29, 2025

గాజాపై దాడులు.. 60 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 60 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశించడంతో సైన్యం 3చోట్ల బాంబుల వర్షం కురిపించింది. కాగా బందీల మృతదేహాల అప్పగింతకు ఉద్రిక్త పరిస్థితులు అడ్డంకిగా ఉన్నట్లు హమాస్ పేర్కొంది. హమాస్ ఇజ్రాయెల్ సైనికుడిని చంపడం వల్లే దాడి జరిగిందని, ఇది శాంతికి విఘాతం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

News October 29, 2025

కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

image

అధిక వర్షపాతం ఉన్న సమయంలో ఈ ఆకుగూడు పురుగు పంటను ఆశిస్తుంది. కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆశిస్తుంది. లార్వాలు చిగురాకులను, ఆకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్‌ఫాస్‌ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్‌ 36% యస్‌.యల్‌ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలి.

News October 29, 2025

తుఫాన్ బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000

image

AP: తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఆర్థిక <<18137630>>సాయం<<>> ప్రకటించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.1000 అందజేయాలని నిర్ణయించింది. కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ ఉంటే గరిష్ఠంగా రూ.3000 అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే ముందు ఈ నగదు ఇవ్వనున్నారు.