News October 26, 2025

తుఫాను అప్‌డేట్

image

AP: బంగాళాఖాతంలోని వాయుగుండం సాయంత్రానికి తుఫానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని APSDMA అధికారులు చెప్పారు. ప్రస్తుతం కాకినాడకు 880 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు.

Similar News

News October 26, 2025

వంటింటి చిట్కాలు

image

☛ ఇడ్లీ పిండి పులవకుండా ఉండాలంటే ఆ పిండిపై తమలపాకు ఉంచండి.
☛ క్యాబేజీ ఉడికించేటప్పుడు వచ్చే వాసన కొందరికి నచ్చదు. అప్పుడు చిన్న అల్లం ముక్క వేస్తే ఆ వాసన తగ్గుతుంది.
☛ అల్లం వెల్లుల్లి ముద్ద చేసేటప్పుడు చెంచా వంటనూనె చేర్చితే.. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
☛ కొత్త బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు మట్టివాసన వస్తుంటే నాలుగు పుదీనా ఆకులు వేయండి. వాసన పోయి కూరకు సువాసన వస్తుంది.

News October 26, 2025

సచిన్ రికార్డును బ్రేక్ చేయడం కష్టమే!

image

వన్డేల్లో అత్యధిక పరుగుల లిస్టులో సచిన్(18,426) టాప్లో ఉన్నారు. నిన్న సంగక్కరను(14234)ను కోహ్లీ(14,255) అధిగమించి టాప్2 అయ్యారు. దీంతో సచిన్‌నూ అధిగమిస్తారా? అనే చర్చ మొదలైంది. 2025-26లో IND 15ODIలు ఆడనుంది. ఆసియా కప్, WCలో గరిష్ఠంగా 30 మ్యాచుల ఛాన్స్ ఉంది. విరాట్ సగటున 60-70 రన్స్ చేస్తే 2K రన్స్ అవుతాయి. ఇంకా 2K పరుగులు వెనుకబడి ఉంటారు. సో.. సచిన్ రికార్డు బ్రేక్ చేయడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

News October 26, 2025

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి: అనిత

image

AP: ‘మొంథా’ తుఫాను నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ’27, 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలి’ అని అధికారులతో సమీక్షలో సూచించారు.