News October 27, 2025

విషాదాలు మిగిలిస్తున్న తుఫాన్లు

image

AP: తుఫాన్లు కోస్తాంధ్రాను అతలాకుతలం చేస్తున్నాయి. 1971-2023 మధ్య 60 తీవ్రమైన సైక్లోన్లు తీరం దాటాయి. 1971లో బారువ, 1977లో దివిసీమ, 1996లో బలుసుతిప్పతో పాటు తర్వాత సంభవించిన ఖైముక్, లైలా, జల్, నీలం, హుద్‌హుద్, తితిలీ తుఫాన్లు తీవ్ర ఆస్తి, పంట, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. MAR నుంచి JUNE.. SEP నుంచి DEC వరకు 2 సీజన్లలో సైక్లోన్లు సంభవిస్తుంటాయి. కానీ వాతావరణ మార్పులతో OCTలోనే దూసుకొస్తున్నాయి.

Similar News

News October 27, 2025

ఉపనిషత్తుల గురించి ఇవి మీకు తెలుసా..?

image

భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉపనిషత్తులు అత్యున్నత స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఇవి వేదాల అంత్య భాగాలైనందున వేదాంతాలని అంటారు. ‘ఉపనిషత్’ అంటే గురువు సన్నిధిలో పొందే ఆత్మజ్ఞానం. జగద్గురు ఆది శంకరాచార్యులు 11 ఉపనిషత్తులకు వివరణ రాశారు. నిజమైన సుఖం, ఆనందం కేవలం బయటి వస్తువుల ద్వారా కాక, ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే లభిస్తుందని ఉపనిషత్తుల సారం బోధిస్తుంది. ఇవి మోక్ష మార్గాన్ని సులభతరం చేస్తాయి. <<-se>>#VedikVibes<<>>

News October 27, 2025

త్వరలోనే మార్కాపురం కేంద్రంగా జిల్లా!

image

AP: పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల కోరిక అయిన మార్కాపురం జిల్లా కల త్వరలోనే సాకారం కానుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇవ్వగా, క్యాబినెట్ సబ్ కమిటీ కూడా జిల్లాను ప్రతిపాదించింది. దీంతో మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. అటు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం(D)లోకి తిరిగి చేర్చడంపై NOV 7న క్లారిటీ రానుంది.

News October 27, 2025

సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ గ‌డువు పొడిగింపు

image

ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్‌షిప్‌ని అందిస్తోంది. 10th పాసై ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌‌కు అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ఉండాలి. తాజాగా దరఖాస్తు గడువు తేదీని నవంబర్ 20 వరకు పొడిగించారు.
వెబ్‌సైట్‌: <>https://www.cbse.gov.in<<>>