News April 3, 2024

విచిత్రం.. తలపై కొమ్ముతో ‘జంతు మనిషి’

image

MP భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తికి జంతువులాగా తలపై కొమ్ము పెరుగుతోంది. దీంతో ఆయన్ను ‘జంతు మనిషి’ అంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. సాగర్ జిల్లాలోని రహ్లి గ్రామానికి చెందిన శ్యామ్ లాల్ యాదవ్‌‌ తలకు 2014లో గాయమైంది. కొన్ని రోజులకు తలపై వింతగా చర్మం పెరగడాన్ని గమనించి కత్తిరిస్తూ వస్తున్నాడు. మరింత వేగంగా పెరగడంతో వైద్యులను సంప్రదించగా.. ఇది అరుదైన చర్మవ్యాధని, క్యాన్సర్‌‌కు సంకేతమని తెలిపారు.

Similar News

News April 4, 2026

నేవీ అమ్ములపొదిలోకి ‘అరిదమన్’

image

భారతీయ నౌకాదళంలోకి స్వదేశీ సాంకేతికతతో తయారైన అణు జలాంతర్గామి ‘అరిదమన్’ చేరింది. దీంతో నేవీ అమ్ములపొదిలోని న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ల సంఖ్య మూడుకు పెరిగింది. ఇది INS అరిఘాట్, INS అరిహంత్‌తో పోలిస్తే అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఈ జలాంతర్గామి 3,500 కిలోమీటర్ల రేంజ్‌‌కు వెళ్లే అణుసామర్థ్యం గల ఎనిమిది కే-4 మిసైళ్లను మోయగలదు. దీంతో పాటు 24 K-15 సాగరిక న్యూక్లియర్ మిసైల్స్‌ను కూడా మోసే సామర్థ్యం ఉంది.

News April 4, 2026

ఓడామని వదలొద్దు.. ప్రయత్నిస్తే విజయం తథ్యం

image

అనగననగ రాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం: సంగీతం రానివారైనా రాగాలను పదేపదే ఆలపిస్తూ ఉంటే కొన్నాళ్లకు వినసొంపుగా పాడగలుగుతారు. వేప ఆకులు చేదుగా ఉన్నా రోజూ తింటూ ఉంటే కొన్నాళ్లకు తియ్యగా అనిపిస్తాయి. ఏ రంగమైనా సాధనతో నైపుణ్యం పెరిగి రాణిస్తారు. తొలిసారి విఫలమైనా తుదకు విజయం సాధిస్తారు.

News April 4, 2026

రైనా 18ఏళ్ల రికార్డ్ బ్రేక్!

image

పంజాబ్‌‌తో పోరులో చెన్నై ఓడినా ఆ జట్టు యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే ప్రదర్శనపై ప్రశంసలు కురుస్తున్నాయి. 43బంతుల్లో 73రన్స్ చేసి జట్టుకు మంచి స్కోర్ అందించిన మాత్రే చెపాక్‌లో రైనా రికార్డ్ బ్రేక్ చేశారు. 18ఏళ్ల 261రోజుల వయసు ఉన్న మాత్రే చెన్నై హోంగ్రౌండ్‌లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచారు. అంతకుముందు 2008లో రైనా(21ఏళ్ల 148రోజులు) MIపై హాఫ్ సెంచరీ కొట్టారు.