News May 18, 2024

ఓటేసేందుకు బ్రహ్మచారుల షరతు

image

హరియాణాలో మే 25న జరిగే ఎన్నికల్లో ఓటేసేందుకు అక్కడి బ్రహ్మచారులు షరతు పెట్టారు. బ్రహ్మచారుల గణనతో పాటు పెన్షన్ సక్రమంగా ఇస్తామని లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఓటేస్తామంటున్నారు. లేకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. తమది అవమానకర జీవితమని, అందరూ హేళన చేస్తుంటారని వారు అంటున్నారు. కాగా.. గతేడాది అక్కడి ప్రభుత్వం పెళ్లికాని 45-60ఏళ్ల వయస్కులకు పెన్షన్(నెలకురూ.2,750) పథకం ప్రవేశపెట్టింది.

Similar News

News December 29, 2025

సూపర్ నేపియర్ గడ్డిని ఎలా పెంచాలి?

image

పశుగ్రాసం కొరతను తగ్గించి, పాడి పశువులకు ఎక్కువ పోషకాలను అందించే గడ్డి సూపర్ నేపియర్. దీన్ని చౌడు నేలలు మినహా ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. దీని సాగుకు ముందు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20kgల నత్రజని, 10kgల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్ని, ప్రతీ 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసి, ఎకరాకు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు నాటుకోవాలి.

News December 29, 2025

మహిళలు పుట్టుకతోనే నాయకులు: ఈషా అంబానీ

image

నాయకత్వ స్థానాలకు పురుషులతో పాటూ స్త్రీలూ సమానంగా న్యాయం చేయగలరంటున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ ఈషా అంబానీ. “అయితే కెరీర్​లో పురుషుల ఎదుగుదలతో పోలిస్తే మహిళల ఎదుగుదల చాలా కష్టం. మగవాళ్ల కంటే మహిళలు నాయకత్వంలో ముందుంటారని నేను వ్యక్తిగతంగా నమ్ముతా. మహిళలు పుట్టుకతోనే నాయకులు. మహిళల్లో ఉండే నిస్వార్థమైన మనసు వారిని మంచి నాయకులుగా తీర్చిదిద్దుతుంది” అని ఈషా తెలిపారు.

News December 29, 2025

శివాలయానికి వెళ్తున్నారా?

image

శివాలయంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ‘ప్రదోష కాల దర్శనం గ్రహ దోష నివారణకు శ్రేష్ఠం. గణపతి దర్శనానంతరం లింగాన్ని దర్శించాలి. నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూడటం మర్వకూడదు. శివునికి అర్చించిన ప్రసాదం, విభూతి, పూలను నందిపై ఉంచరాదు. సోమసూత్రాన్ని దాటకుండా ప్రదక్షిణలు చేయాలి’ అంటున్నారు. శివాలయంలో ‘చండీ ప్రదక్షిణ’ ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.