News December 25, 2024
విచిత్రం: మగ టీచర్‌కు ప్రసూతి సెలవు మంజూరు
బిహార్ విద్యాశాఖలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వైశాలి జిల్లాకు చెందిన జితేంద్ర కుమార్ అనే మగ టీచర్ ప్రసూతి సెలవు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా విచిత్రంగా ఆయనకు మంజూరయ్యాయి. దీంతో ఆయన 8 రోజులపాటు మెటర్నిటీ లీవ్‌లను ఎంజాయ్ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవడంతో అధికారులు స్పందించారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తామన్నారు.
Similar News
News December 25, 2024
ప్రజలను వణికిస్తోన్న చలి పులి
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. రానున్న రెండు రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. TGలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 5.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే హైదరాబాద్‌లో 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అటు APలోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
News December 25, 2024
రేపు సెలవు
తెలంగాణలో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఉండనుంది. క్రిస్మస్ సందర్భంగా ఈరోజు, రేపు ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. అటు ఏపీ ప్రభుత్వం ఇవాళ ఒక్కరోజే పబ్లిక్ హాలిడే ఇవ్వగా, రేపు ఆప్షనల్ హాలిడే అని తెలిపింది. అంటే అక్కడి పరిస్థితులను బట్టి జిల్లా విద్యాధికారులు సెలవు ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటారు. ఈమేరకు సెలవు ఉండేది, లేనిది ఇప్పటికే విద్యార్థులకు సమాచారం అందించారు.
News December 25, 2024
IND vs AUS : రేపే బాక్సింగ్ డే టెస్ట్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. మెల్బోర్న్లో ఉదయం 5 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడొచ్చు. ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో ముందుకెళ్లాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ ఓపెనింగ్ వస్తారని తెలుస్తోంది. నితీశ్‌ను పక్కనబెడతారని టాక్.