News July 11, 2024
వింత రూల్.. అక్కడ రోజులో ఒక్కసారైనా నవ్వాల్సిందే!

రోజులో ఒక్కసారైనా ప్రజలు నవ్వాల్సిందేనంటూ జపాన్లో వింత చట్టం తెచ్చారు. ఈ మేరకు నార్త్ జపాన్లోని యమగట అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులిచ్చింది. నవ్వితే గుండెపోటు ముప్పు తగ్గుతుందని పరిశోధనలో తేలడంతో ఈ రూల్ పాస్ చేసింది. నెలలో 8వ రోజుని నవ్వు దినంగా జరపనుంది. పని ప్రదేశంలో ఈ రూల్ తప్పక పాటించాలంది. కాగా నవ్వాలా వద్దా అనేది వ్యక్తిగత విషయమని దీనిపై బలవంతం సరికాదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
Similar News
News December 10, 2025
Gmailలో మెసేజ్లను ఇలా షెడ్యూల్ చేసుకోండి

కొన్ని ముఖ్యమైన మెయిల్స్ను సరైన సమయంలో పంపించాల్సి ఉంటుంది. దీనికి Gmailలోని ‘Schedule Send’ ఫీచర్ ఉపయోగపడుతుంది. మెసేజ్ను ముందుగానే టైప్ చేసి, అది ఎప్పుడు పంపించాలో ఆ టైమ్ సెలక్ట్ చేసుకోవచ్చు. మొబైల్లో షెడ్యూల్ చేయాలంటే జీమెయిల్ ఓపెన్ చేసి, Composeపై క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేసిన తరువాత రైట్ సైడ్ టాప్లో ఉండే 3 చుక్కలపై క్లిక్ చేయాలి. అందులో Schedule Sendను ఎంపిక చేస్తే సరిపోతుంది.
News December 10, 2025
విష్ణుమూర్తి ఎక్కడెక్కడ ఉన్నాడంటే?

సర్వగః సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్దనః|
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః||
విష్ణువు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. సమస్తం తెలిసిన ఆయన సూర్య కిరణాల రూపంలో మనకు వెలుగు పంచుతూ ఉన్నాడు. ఈ విశ్వంలో అన్ని సేనలకు నాయకుడై, కాల రూపుడై అందరినీ తనలో లీనం చేసుకుంటున్నాడు. వేదాలు, వేద జ్ఞానం కూడా ఆయనే. వేదాంగాలకు అధిపతి, వేదాల పరమార్థాన్ని తెలుసుకున్న ఆ మహాకవిని నమస్కరించాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 10, 2025
వేరుశనగలో అంతర పంటలతో లాభాలేంటి?

వర్షాభావ పరిస్థితులు, బెట్ట, కరవు పరిస్థితులు ఏర్పడి ప్రధాన పంట అయిన వేరుశనగ నష్టపోయినా.. అంతర పంటల నుంచి కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వేరుశనగ, అంతరపంటల వేరువ్యవస్థ పొడవులో తేడాల వల్ల భూమిలోని పోషకాలు, నీటిని పంటలు సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. చీడపీడల ఉనికి చాలావరకు తగ్గుతుంది. వర్షపునీటిని పొలంలోనే ఇంకేటట్లు చేయడంలో, నేలకోతను నివారించడంలో అంతరపంటలు కీలకపాత్ర పోషిస్తాయి.


