News August 3, 2024
స్ట్రాబెర్రీ ఒక్క ప్రూట్ కాదు.. వందల పండ్లు!

స్ట్రాబెర్రీలను ఇష్టంగా తినే చాలామంది వాటిపైన ఉండే సీడ్స్తో కాస్త ఇబ్బంది ఫీలవుతుంటారు. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే అవి సీడ్స్ కావని, వాస్తవానికి అవన్నీ పండ్లు అని పరిశోధకులు తెలిపారు. అకీన్స్ అనే పిలిచే వీటి లోపలే విత్తనాలుంటాయి. అంటే ఒక స్ట్రాబెర్రీ తింటే వందల ఫ్రూట్స్ తిన్నట్లు. ఈ అకీన్స్ను కలిపి ఆధారంగా ఉండేదే ఎర్రటి కండ భాగం. దీని సైజ్ పెరిగినా అకీన్స్ మాత్రం దాదాపు సమాన పరిమాణంలోనే ఉంటాయి.
Similar News
News November 16, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

గత వారంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. హైదరాబాద్లో స్కిన్ లెస్ కేజీ రూ.210-230 పలుకుతోంది. కామారెడ్డిలో రూ.230-240గా ఉంది. అటు ఏపీలోని విజయవాడలో రూ.250, గుంటూరులో రూ.260, ప.గో. జిల్లా భీమవరంలో రూ.230-250, ఏలూరులో రూ.230కి విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో మటన్ కేజీ రూ.800కు పైగానే ఉంది. మరి మీ ఏరియాలో చికెన్, మటన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 16, 2025
కుమారుడి ఫస్ట్ బర్త్డే.. ఫొటో షేర్ చేసిన రోహిత్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్లో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న తన కుమారుడు అహాన్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘సమయం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. కానీ ప్రతి క్షణాన్ని మేము ఆస్వాదిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
ibomma రవి: సీఈవో నుంచి పైరసీ దాకా..

పైరసీ మూవీ వెబ్సైట్ ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవి నిన్న అరెస్టయిన విషయం తెలిసిందే. అతడు గతంలో ER ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి CEOగా పని చేశాడు. ఐదేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నాడని, తర్వాత పైరసీ రంగంలోకి అడుగుపెట్టాడని తెలుస్తోంది. సర్వర్లను ఈజీగా హ్యాక్ చేయగలిగేలా పట్టు సాధించాడని సమాచారం. అయితే తనను పోలీసులు పసిగట్టరనే ధీమాతో విదేశాల నుంచి కూకట్పల్లికి వచ్చి దొరికిపోయాడు.


