News October 4, 2025

విదేశీ కోచ్‌లపై వీధి కుక్కల దాడి.. విమర్శలు!

image

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లలో షాకింగ్ ఘటన జరిగింది. అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా కెన్యా స్ప్రింట్స్ కోచ్ డెన్నిస్ మరాగియా మ్వాన్జోను వార్మప్ ట్రాక్‌పై వీధికుక్క కరిచింది. వెంటనే ఆయనకు చికిత్స అందించారు. అంతకుముందే జపాన్ పారా అథ్లెటిక్స్ అసిస్టెంట్ కోచ్ మెయికో ఓకుమాట్సు పైనా వీధికుక్క దాడి చేయడంపై విమర్శలొస్తున్నాయి.

Similar News

News October 4, 2025

APPLY NOW: NITCలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్‌ 12 ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఆయా విభాగాల్లో పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.2500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500. వెబ్‌సైట్: https://nitc.ac.in/

News October 4, 2025

మొక్కజొన్న సాగుకు మంచి భవిష్యత్తు

image

దేశంలో మొక్కజొన్న వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇంధన దిగుమతులను తగ్గించడానికి పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలనే కేంద్ర నిర్ణయంతో ఇథనాల్ పరిశ్రమలు మొక్కజొన్నలను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. అలాగే పశువులు, కోళ్లకు దాణాగా, పాప్ కార్న్, గోధుమ పిండి, బిస్కెట్స్, ఇతర ఆహార పదార్థాల తయారీలోనూ మొక్కజొన్న ఉత్పత్తులది కీలకపాత్ర. అందుకే భవిష్యత్తుల్లో మొక్కజొన్న ఉత్పత్తులకు డిమాండ్ మరింత పెరగనుంది.

News October 4, 2025

అమెరికాలో హైదరాబాద్‌ వాసి దారుణ హత్య

image

అమెరికాలో దుండగుడి దుశ్చర్యకు మరో <<17684402>>తెలుగు<<>> వ్యక్తి బలయ్యాడు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన పోలే చంద్రశేఖర్ ఉన్నత చదువుల కోసం US వెళ్లారు. ఈక్రమంలోనే డాలస్‌లోని పెట్రోల్ బంక్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఓ దుండగుడు పెట్రోల్ కొట్టించుకునేందుకు బంక్‌కు వచ్చి చంద్రశేఖర్‌ను దారుణంగా కాల్చి చంపాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. US పోలీసులు దర్యాప్తు చేపట్టారు.