News August 20, 2024

బాక్సాఫీస్ వద్ద ‘స్త్రీ-2’ జోరు.. 5 రోజుల్లోనే రూ.242 కోట్లు

image

హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘స్త్రీ-2’ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 5 రోజుల్లోనే రూ.242 కోట్లు సాధించింది. ఈ వారంలో రూ.500 కోట్ల మార్క్ చేరుకునే అవకాశం ఉందని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించారు.

Similar News

News January 23, 2025

పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ

image

TG: రాష్ట్రంలో పొద్దున, రాత్రి చలి వణికిస్తుండగా మధ్యాహ్నం ఎండ దంచుతోంది. ఉదయం 9 గంటలైనా పొగమంచుతో కూడిన చలి ఉంటోంది. సాయంత్రం 6 అయితే చాలు ఉష్ణోగ్రతలు పడిపోయి గజగజ మొదలవుతోంది. చాలా జిల్లాల్లో 10 డిగ్రీలలోపు టెంపరేచర్ నమోదవుతోంది. ఇక మధ్యాహ్నం ఎండ సుర్రుమంటోంది. 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఈ భిన్న వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News January 23, 2025

హైదరాబాద్ నుంచి వియత్నాంకు విమాన సర్వీస్

image

TG: మార్చి 18 నుంచి హైదరాబాద్, వియత్నాం మధ్య విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. వియట్‌జెట్ సంస్థ నడిపే ఈ విమాన సర్వీసులు వారంలో రెండు రోజులు(మంగళ, శనివారం) మాత్రమే అందుబాటులో ఉంటాయి. హోచిమన్ సిటీ(వియత్నాం) నుంచి రాత్రి 7.40కు బయల్దేరే ఫ్లైట్ రాత్రి 10.35కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. రాత్రి 11.35కు శంషాబాద్‌లో బయల్దేరి, తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు వియత్నాం చేరుతుంది.

News January 23, 2025

పౌర విమానయానంలో 15% వృద్ధి: రామ్మోహన్

image

PM మోదీ నేతృత్వంలో భారత్ ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అత్యుత్తమ విధానాలే బలమైన దేశంగా మారడానికి కారణమని చెప్పారు. ‘ప్రపంచ దేశాలన్నీ అవకాశాల కోసం భారత్ వైపు చూస్తున్నాయి. పౌర విమానయాన రంగాన్ని సుస్థిరం చేయడమే మా లక్ష్యం. ఏఐ, డీప్ టెక్ లాంటి సాంకేతికత ద్వారా సేవలు మరింత విస్తృత పరుస్తాం. పౌరవిమానయాన రంగం ప్రస్తుతం 15% వృద్ధి చెందుతోంది’ అని దావోస్‌లో రామ్మోహన్ తెలిపారు.