News September 26, 2024
OTTలోకి వచ్చేసిన బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ ‘స్త్రీ-2’

ఈ ఏడాది బిగ్గెస్ట్ బాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘స్త్రీ-2’ సినిమా భారీ వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న రిలీజై రూ.600 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో అదరగొడుతోంది. తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ చిత్రం చూడాలంటే ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నా రూ.349 రెంట్ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. కొన్నిరోజుల తర్వాత ఈ అద్దెను తొలగించే అవకాశం ఉంది.
Similar News
News December 1, 2025
వేములవాడ: పార్వతీపురం- ఆలయంవైపు వాహనాలకు NO ENTRY

వేములవాడ పట్టణంలోని పార్వతీపురం నుంచి భీమేశ్వరాలయంవైపు వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో నటరాజ విగ్రహం పరిసరాల్లో భక్తుల సంచారం ఎక్కువ అవుతోంది. పార్వతీపురం నుంచి వచ్చే భక్తుల వాహనాలతో మరింత ఇబ్బందిగా మారింది. దీంతో ఈ ప్రాంతం నుంచి భీమేశ్వరాలయంవైపు వాహనాలు రాకుండా అన్నదాన సత్రం వద్ద ప్రత్యేకంగా గేటు ఏర్పాటు చేశారు.
News December 1, 2025
శివుడు పుర్రెల దండ ఎందుకు ధరిస్తాడు?

పరమ శివుడు పుర్రెల దండ, చితాభస్మం ధరించి శ్మశానంలో తిరుగుతుంటాడు. అందుకు కారణం శిష్టరక్షణ. అసురులు ధర్మబద్ధంగా వరాలు పొంది దేవతలను హింసించేవారు. వారిని మోహానికి గురి చేయడానికి విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు శివుడు ఈ వేషం ధరించి, పాషండ మతాన్ని ఉపదేశించాడు. దీంతో వేద నింద, దైవ నింద చేసిన రాక్షసుల తేజస్సు క్షీణించింది. అలాగే వారి నుంచి దేవతలకు ఉపశమనం లభించింది. ఇది ధర్మ రక్షణకై హరిహరులు చేసిన లీల.
News December 1, 2025
భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు

AP: రాష్ట్రంలో <<18409601>>స్క్రబ్ టైఫస్<<>> వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కు పైగా కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ లక్షణాలతో విజయనగరంలో మహిళ మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని ఫీవర్ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇది అంటు వ్యాధి కాదని వైద్యులు తెలిపారు.


