News September 18, 2024

కలెక్షన్లలో ‘స్త్రీ-2’ రికార్డు

image

బాలీవుడ్‌ నటీనటులు రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించగా దర్శకుడు అమర్‌ కౌశిక్‌ తెరకెక్కించిన హారర్‌ కామెడీ ‘స్త్రీ-2’ రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 15న రిలీజైన ఈ సినిమా రూ.586 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ లైఫ్ టైమ్ కలెక్షన్లను క్రాస్ చేయడంతో ‘స్త్రీ-2’ ప్రస్తుతం అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచినట్లు తెలిపాయి.

Similar News

News August 31, 2025

రేపు రాజంపేటలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. రాజంపేట మండలం, కె.బోయినపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన పంపిణీ చేయనున్నారు. ప్రతి నెల 1న సీఎం వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ నేరుగా పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. రేపటి కార్యక్రమం అనంతరం సాయంత్రం తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.

News August 31, 2025

భారత్‌పై మరో కుట్రకు తెరలేపిన ట్రంప్?

image

50% టారిఫ్స్ అమలు చేస్తూ భారత ఎకానమీని దెబ్బకొట్టాలని చూస్తున్న ట్రంప్ మరో కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. తమలాగే ఇండియాపై టారిఫ్స్ విధించాలని యూరోపియన్ దేశాలకు US సూచించినట్లు సమాచారం. IND నుంచి ఆయిల్, గ్యాస్ కొనుగోళ్లను కూడా పూర్తిగా నిలిపేయాలని చెప్పినట్లు తెలిసింది. ట్రేడ్ డీల్‌కు భారత్ ఒప్పుకోకపోవడం, రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపకపోవడంతో ట్రంప్ అసహనానికి గురై ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం.

News August 31, 2025

నేడు కీలక చర్చ.. ప్రభుత్వం ఏం చేయనుంది?

image

TG: కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రిపోర్ట్‌ను మంత్రి ఉత్తమ్ సభ్యులకు వివరించిన అనంతరం సుదీర్ఘంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. సిట్ లేదా సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశమున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అటు పూర్తి నివేదికకు బదులు 63 పేజీల షార్ట్ రిపోర్ట్‌ను సభలో ప్రవేశపెడతారని వార్తలొస్తున్నాయి.