News August 24, 2025

స్త్రీ శక్తి.. మహిళలకు రూ.41.22 కోట్లు మిగులు: టీడీపీ

image

AP: కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్త్రీ శక్తి పథకంతో వారం రోజుల్లోనే మహిళలకు రూ.41.22 కోట్లు మిగిలాయని టీడీపీ ట్వీట్ చేసింది. ఏడు రోజుల్లో 1.04 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేశారని వెల్లడించింది. గతంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే స్త్రీ, పురుష నిష్పత్తి 40:60 ఉంటే ఇప్పుడు రివర్స్ అయిందని పేర్కొంది. కొత్త పథకం అమల్లోకి వచ్చాక పురుష ప్రయాణికులు తగ్గి మహిళలు పెరిగారని తెలిపింది.

Similar News

News August 24, 2025

తుర్కియే, అజర్‌బైజాన్‌ దేశాలకు షాకిచ్చిన ఇండియన్స్

image

‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చిన తుర్కియేకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. గత 3 నెలల్లో భారత పర్యాటకుల సంఖ్య 50% తగ్గింది. ఈ ఏడాది మేలో 31,659 మంది ఇండియన్స్ ఆ దేశంలో పర్యటించగా, జులైలో ఆ సంఖ్య 16,244కి తగ్గింది. ‘ఆపరేషన్ సిందూర్’లో తుర్కియేకు చెందిన డ్రోన్లను పాక్ ఉపయోగించింది. అటు పాక్‌కు సపోర్ట్ చేసిన అజర్‌బైజాన్‌లోనూ భారత పర్యాటకుల సంఖ్య గతేడాది జూన్‌తో పోలిస్తే 60% తగ్గింది.

News August 24, 2025

ఎల్లుండి నుంచి స్పాట్ అడ్మిషన్లు

image

TG: JNTUతో పాటు అనుబంధ కాలేజీల్లో మిగిలిపోయిన ఇంజినీరింగ్ సీట్లకు ఈ నెల 26 నుంచి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. 26న వర్సిటీ క్యాంపస్, సుల్తాన్‌పూర్, 28న జగిత్యాల, మంథని, 29న వనపర్తి, సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్ కాలేజీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆయా కాలేజీల్లో సీట్లు కావాల్సిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని అధికారులు సూచించారు.

News August 24, 2025

గుడ్డులోని పచ్చసొన తినట్లేదా?

image

కోడిగుడ్డులోని పచ్చసొన మంచిది కాదని కొందరు దాన్ని దూరం పెడతారు. అయితే ఎగ్ ఎల్లోతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని ICMR తెలిపింది. అందులోని విటమిన్ B12, D, A, ఐరన్, ఒమెగా-3 అనే హెల్తీ ఫ్యాట్స్‌తో శరీరానికి పోషకాలు అందుతాయి. Lutein, Zeaxanthin కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొలిన్ వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. రోజుకు రెండు గుడ్లు (ఎల్లోతో సహా) తినాలని వైద్యులు సూచిస్తున్నారు.