News August 19, 2025
విద్యార్థుల బస్సుల్లో స్త్రీ శక్తి పథకం వర్తించదు: ఆర్టీసీ ఎండీ

AP: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం తీసుకొచ్చిన స్త్రీ శక్తి పథకానికి అద్భుతమైన స్పందన వస్తోందని ఎండీ ద్వారకా తిరుమల రావు అన్నారు. రద్దీకి తగినట్లుగా రాబోయే రోజుల్లో అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించిన బస్సుల్లో ఈ పథకం వర్తించదని తెలిపారు. రోజూ 18 లక్షల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని వెల్లడించారు.
Similar News
News August 19, 2025
హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్

TG: ‘కాళేశ్వరం’ విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ నివేదికను నిలిపేయాలని కోరుతూ మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి రెండు పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్లు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
News August 19, 2025
వైర్లు కట్.. కేబుల్ ఆపరేటర్ల ఆందోళన

హైదరాబాద్‌లోని TGSPDCL కార్యాలయం ఎదుట కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. రామంతాపూర్ ఘటనకు <<17452500>>కేబుల్<<>> వైర్లు కారణం కాదని, వాటిలో విద్యుత్ సరఫరా అవ్వదని తెలిపారు. వైర్లు తొలగిస్తే లక్షలమంది ఉపాధి కోల్పోతారని, వర్క్ ఫ్రమ్ హోం చేసే వాళ్లు ఇబ్బంది పడతారని వెల్లడించారు. కేబుల్ వైర్లను కట్ చేయొద్దని డిమాండ్ చేశారు.
News August 19, 2025
‘వార్-2’కు రూ.300 కోట్ల కలెక్షన్స్

‘వార్-2’ సినిమా ఇప్పటివరకు రూ.300.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. ఇండియాలో రూ.240 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.60.50 కోట్లు వచ్చినట్లు తెలిపింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, Jr.NTR ప్రధాన పాత్రల్లో నటించారు. YRF స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ మూవీ అగస్టు 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.