News August 3, 2024

అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల

image

AP: రేషన్ లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తక్కువ ధరకే కందిపప్పు అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ పంపిణీలో అక్రమాలు జరిగాయని, అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో వ్యాఖ్యానించారు.

Similar News

News January 28, 2026

MLAపై లైంగిక ఆరోపణలు.. విచారణకు జనసేన కమిటీ

image

AP: రైల్వే కోడూరు జనసేన MLA అరవ శ్రీధర్ తనను <<18975483>>లైంగికంగా<<>> వేధించారని సదరు మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై జనసేన కమిటీని ఏర్పాటు చేసింది. ‘శ్రీధర్‌పై వచ్చిన వార్తలపై విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించాం. వారంలో శ్రీధర్ కమిటీకి వివరణ ఇవ్వాలి. కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకునే వరకు ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతున్నాం’ అని పేర్కొంది.

News January 28, 2026

ఆధార్ యాప్ వచ్చేసింది!

image

ఆధార్ సేవల్లో విప్లవాత్మక మార్పులు చేస్తూ UIDAI కొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇకపై ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఆధార్ <<18974342>>యాప్<<>> ద్వారానే మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చింది. ‘డిజిటల్ ఐడెంటిటీ’ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రయాణాల్లో ఫిజికల్ కాపీలు అవసరం లేకుండానే వెరిఫై చేసేలా మార్పులు చేసింది. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ పనులకు ఇది కీలకం కానుంది.

News January 28, 2026

T20 వరల్డ్ కప్‌లో ఆడాల్సిందే: పాక్ మాజీలు

image

బంగ్లాదేశ్‌కు మద్దతుగా T20 WCను <<18966853>>బహిష్కరించాలని<<>> పాకిస్థాన్ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీసీబీ చీఫ్ నఖ్వీకి వ్యతిరేకంగా పాక్ మాజీలు గొంతు విప్పుతున్నారు. టోర్నీకి వెళ్లకపోతే పాక్‌కే నష్టమని హెచ్చరిస్తున్నారు. WCకు జట్టును పంపాలని ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ హఫీజ్, మొహ్సిన్ ఖాన్, రషీద్ సూచించారు. ఐసీసీతో సంబంధాలు చెడగొట్టుకుని ఏం సాధిస్తారని పీసీబీ మాజీ కార్యదర్శి అబ్బాసీ ప్రశ్నించారు.