News March 28, 2024
పొత్తు ధర్మం పాటించకపోతే కఠిన చర్యలు: పవన్

AP: పొత్తు ధర్మం పాటించి మిత్ర పక్ష కూటమిని గెలిపించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జనసైనికులకు పిలుపునిచ్చారు. పొత్తు ధర్మం పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ‘పొత్తులో భాగంగా త్యాగాలు తప్పవు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంరక్షణ కోసం మిత్రపక్ష కూటమిని గెలిపించుకోవాలి. ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా మూడు పార్టీలు ముందుకెళ్లాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 21, 2026
SLBCలో రెండు వైపులా తవ్వకాలు: ఉత్తమ్

TG: SLBC ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ‘ఇప్పటికే దేవరకొండ నుంచి ఔట్‌లెట్ పనులు జరుగుతున్నాయి. రెండు వైపులా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి’ అని తెలిపారు. భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రూల్స్ కఠినంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. సొరంగ మార్గంలో గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సచివాలయంలో జరిగిన సమీక్షలో సూచించారు.
News March 21, 2026
‘ఒత్తిడికి లొంగేది లేదు’.. అమెరికాకు శ్రీలంక షాక్!

అమెరికా యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు పర్మిషన్ నిరాకరించి శ్రీలంక షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని లంక అధ్యక్షుడు దిస్సనాయకే పార్లమెంటులో వెల్లడించారు. ‘మట్టాల ఎయిర్‌పోర్టులో ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేందుకు ఈ నెల 4, 8 తేదీల్లో వచ్చిన 2 రిక్వెస్టులను తిరస్కరించాం. ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయి. అయినా మేం లొంగిపోము. మిడిల్ ఈస్ట్ యుద్ధం సవాళ్లు విసురుతోంది. న్యూట్రల్‌గా ఉండేందుకు సాధ్యమైనదంతా చేస్తాం’ అని చెప్పారు.
News March 21, 2026
మార్చి 21: చరిత్రలో ఈ రోజు

1857: జపాన్‌లో భారీ భూకంపం.. 100,000 మంది మృతి
1916: షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం
1970: నటి శోభన జననం(ఫొటోలో)
1978: బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ జననం
1990: అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి మరణం
2022: రంగస్థల నటుడు, దర్శకుడు తల్లావజ్జుల సుందరం మరణం
*ప్రపంచ అటవీ దినోత్సవం
*ప్రపంచ కవితా దినోత్సవం


