News August 29, 2024
గణేశ్ మండపాలకు అనుమతి లేకుండా కరెంట్ వాడితే కఠిన చర్యలు: CM

TG: గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు దరఖాస్తు చేసుకుంటేనే <<13969939>>ఉచిత విద్యుత్<<>> అందిస్తామని CM రేవంత్ అన్నారు. అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జవాబుదారీతనం కోసం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రభుత్వాన్ని కోరింది.
Similar News
News December 3, 2025
చదరంగంలో సంచలనం సృష్టించిన బుడ్డోడు

MP సాగర్ జిల్లాకు చెందిన మూడేళ్ల సర్వజ్ఞసింగ్ కుశ్వాహా ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో ఫిడే ర్యాపిడ్ రేటింగ్ (1572) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 3 సంవత్సరాల 7 నెలల 20 రోజుల వయసులో ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లను ఓడించాడు. స్మార్ట్ఫోన్ అలవాటు దూరం చేయాలనే ఉద్దేశంతో చెస్ నేర్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో ఈ రికార్డు WBకు చెందిన అనీశ్ సర్కార్ (3సం.8నెలలు) పేరిట ఉండేది.
News December 3, 2025
పీఎం మోదీని కలిసిన రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీని కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఆహ్వానించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.
News December 3, 2025
ధర్మశాస్తా దర్శనం: ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే?

అయ్యప్ప స్వాములు ఇరుముడితో 18 మెట్లు దాటిన తర్వాత ధ్వజస్తంభాన్ని దర్శిస్తారు. అనంతరం మణి మండపం, మహా గణపతి, సర్పరాజు వద్ద ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత చిన్ముద్ర ధారియైన అయ్యప్ప దివ్యమంగళ రూపాన్ని కనులారా దర్శించుకుంటారు. ఆ స్వరూపాన్ని గుండెల్లో నింపుకొని, ఇరుముడిని స్వామికి చూపిస్తారు. నెయ్యభిషేకం చేయిస్తారు. చివరగా మాలికపురత్తమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణం మొదలుపెడతారు. <<-se>>#AyyappaMala<<>>


