News October 19, 2024

రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: DGP

image

TG: హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Similar News

News October 19, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బ్లాస్ట్.. ఇద్దరు జవాన్ల వీరమరణం

image

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP) జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈరోజు ఉదయం స్థానిక ధుర్బేద ప్రాంతంలో కూంబింగ్ కోసం ఐటీబీపీ, జిల్లా రిజర్వు గార్డ్ బలగాలు వెళ్తున్న సమయంలో కొడ్లియార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఏపీలోని కడపకు చెందిన కె రాజేశ్ అనే జవాను ఉండటం గమనార్హం.

News October 19, 2024

లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్‌పై GST మినహాయింపులకు మంత్రులు OK

image

లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్‌లపై GSTకి మినహాయింపులు ఇవ్వడంపై మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. Sr సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్‌, రూ.5లక్షల కవరేజీ వర్తించే హెల్త్ ఇన్సూరెన్స్‌కూ పూర్తి మినహాయింపు ఇవ్వడానికి అంగీకరించారని సమాచారం. టర్మ్ ఇన్సూరెన్స్‌పై ఎంత వరకు ఇస్తారో తెలియాల్సి ఉంది. ఈ ప్రతిపాదనలపై రిపోర్టును OCT 31లోపు GST కౌన్సిల్‌కు ఇవ్వాలి. ఆ తర్వాత మీటింగ్‌లో ఫైనలైజ్ అవుతుంది.

News October 19, 2024

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

image

AP: విశాఖ శారదా పీఠానికి ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే గత ప్రభుత్వంలో రూ.15 లక్షలకు శారదా పీఠానికి కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. నివేదిక ఆధారంగా స్థలం అనుమతులను రద్దు చేసింది. దీనిపై సోమవారం అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.