News July 3, 2024
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: చంద్రబాబు
AP: అనుమతి లేని, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ కార్యాచరణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఖరీఫ్‌లో 4 లక్షల భూసార పరీక్షలు చేయాలని సూచించారు.
Similar News
News January 15, 2025
GOOD NEWS: IBPS జాబ్ క్యాలెండర్ విడుదల
బ్యాంకు ఉద్యోగార్థులకు IBPS గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26లో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. RRBలో ఆఫీసర్ స్కేల్ 1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్, PSBలో ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాలకు సంబంధించిన జాబితా ఇందులో ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇతర పూర్తి వివరాల కోసం <
News January 15, 2025
బ్యాక్ టు హైదరాబాద్
సంక్రాంతి పండగ ముగియడంతో ప్రజలు మహానగర బాట పట్టారు. గత 3-4 రోజులుగా స్వస్థలాల్లో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన వారంతా తిరుగుపయనమయ్యారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. రేపటి నుంచి ట్రాఫిక్ మరింత పెరగనుంది. అటు ఏపీ, తెలంగాణ జిల్లాల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
News January 15, 2025
గేమ్ ఛేంజర్ మూవీకి మరో షాక్?
AP: ఆన్‌లైన్ పైరసీ, ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్‌తో ఇబ్బందులు పడుతున్న గేమ్ ఛేంజర్ మూవీకి మరో షాక్ తగలనున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని థియేటర్లలో ఆ చిత్రం స్థానంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ను రీప్లేస్ చేస్తున్నట్లు సినీ జర్నలిస్టులు చెబుతున్నారు. వెంకీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలను దిల్ రాజు నిర్మించారు.