News September 13, 2025

వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు: సత్యకుమార్

image

AP: చికిత్స విషయంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి డాక్టర్లు, సిబ్బందిపై కొందరు దాడి చేయడాన్ని మంత్రి సత్యకుమార్ ఖండించారు. వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘స్టాఫ్ వ్యవహారశైలిలో లోపాలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. వారిపై దాడులు చేసి వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించవద్దు. ఇది సరైంది కాదు’ అని Xలో పేర్కొన్నారు.

Similar News

News February 6, 2026

NZB: గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

image

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్‌బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉన్నాయన్నారు.

News February 6, 2026

NZB: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం

image

సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటనలో భాగంగా శుక్రవారం బర్దిపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. TUలో రూ.20 కోట్లతో నిర్మించనున్న ఎస్సీ బాలురు, బాలికల హాస్టళ్లకు శంకుస్థాపన చేస్తారు. రూ.600 కోట్లతో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇండదవాయిలో సిబ్బంది నివాస గృహాలు (స్టాఫ్ క్వార్టర్స్), అదనపు సౌకర్యాల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.

News February 6, 2026

ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు

image

* అబద్ధాలు కాదు.. చేసింది చెబితే చాలు: CM రేవంత్
* రైతు భరోసా ఇప్పుడే వేయాలి: KTR
* TGలో ఏప్రిల్-మేలో SIR నోటిఫికేషన్: CEO
* YCP భగవంతుడిపై పగ పట్టింది: పవన్
* ‘ఎనర్జీ’లో రూ.7.5లక్షల కోట్ల పెట్టుబడి.. ఏపీకి నీతి ఆయోగ్ బ్లూ ప్రింట్
* అతనిలో అహంకారం పెరిగిపోయింది.. రాహుల్‌పై మోదీ ఫైర్
* ప్రశ్నిస్తే అంత భయమా: రాహుల్ గాంధీ
* బొగ్గు గనిలో పేలుడు.. 16 మంది మృతి