News September 19, 2024

అన్‌ఫిట్ పేరుతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: సింగరేణి సీఎండీ

image

TG: సింగరేణిలో అన్‌ఫిట్ పేరుతో కొంతమంది అక్రమార్కులు అమాయకులైన కార్మికులను మోసం చేస్తున్నారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని CMD బలరాం తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థకు నష్టం కలిగించేలా పనులు చేసే వారి సమాచారాన్ని విజిలెన్స్ విభాగానికి 9491144104కు కాల్ లేదా సంస్థకు మెయిల్ చేసి చెప్పాలని సూచించారు. కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల నజరానా ఇస్తామని ప్రకటించారు.

Similar News

News December 21, 2025

కొత్త చీపురును ఎప్పుడు కొంటే ఉత్తమం?

image

చీపురును గౌరవించాలని మన శాస్త్రాలు చెబుతాయి. తద్వారా ఇంట్లో సంపద, సుఖశాంతులు పెరుగుతాయని నమ్మకం. కొత్త చీపురును మంగళ, గురు, శుక్ర, శనివారాల్లో కొంటే మంచిదని పండితుల వాక్కు. దీపావళి, ధన త్రయోదశి సమయాల్లో కొంటే మరింత శుభకరమని అంటున్నారు. చీపురును దక్షిణ/పడమర దిశలో, ఇతరులకు కనిపించని చోట పడుకోబెట్టి ఉంచాలని సూచిస్తున్నారు. తలకిందులుగా ఉంచితే అవమానించినట్లట. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్నారు.

News December 21, 2025

మళ్లీ ఇంగ్లండ్ ఓటమి.. సిరీస్ ఆసీస్ వశం

image

ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ ఓటముల పరంపర కొనసాగుతోంది. మూడో టెస్టులోనూ ఆసీస్ 82 పరుగుల తేడాతో విజయం సాధించి మరో 2 టెస్టులు మిగిలి ఉండగానే యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో క్రాలీ(85), జేమీ స్మిత్(60), విల్ జాక్స్(47), కార్స్(39), రూట్(39) పరుగులు చేశారు.
స్కోర్లు: ఆసీస్ 371/10, 349/10; ఇంగ్లండ్ 286/10, 352/10

News December 21, 2025

శ్రీనిధి రకం కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

image

శ్రీనిధి జాతి కోళ్లు గోధుమ రంగులో ఉంటాయి. నాటుకోడి గుడ్లకు సమానంగా ఈ కోడి గుడ్లు కూడా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ కోళ్లు 5 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాదికి 140 నుంచి 160 గుడ్లను పెడతాయి. అన్ని వాతావరణ పరిస్థితులను, కొన్ని రకాల వ్యాధులను తట్టుకొని జీవిస్తాయి. పొడవైన కాళ్లతో, ఆకర్షణీయంగా ఉంటాయి. పెరటికోళ్లు పెంచాలనుకునేవారికి శ్రీనిధి కోళ్లు కూడా అనుకూలమైనవి.