News August 15, 2024
కఠిన శిక్షలుంటేనే వీటికి అడ్డుకట్ట: హృతిక్ రోషన్

కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై <<13822185>>హత్యాచారం<<>> ఘటన గురించి దేశం మొత్తం చర్చిస్తోంది. తాజాగా దీనిపై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ స్పందించారు. ‘ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండే సమాజం మనకు కావాలి. కానీ అది పరిణామం చెందేందుకు ఏళ్లు పడుతుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలే ఏకైక మార్గం. బాధిత కుటుంబానికి నేను అండగా ఉంటా. నిన్న రాత్రి దాడికి గురైన వైద్యులందరికీ సపోర్ట్గా ఉంటా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 20, 2025
విడాకులపై DHC తీర్పు.. భిన్నాభిప్రాయాలు!

పరస్పర అంగీకారం ఉంటే కొన్ని సందర్భాల్లో ఏడాది గ్యాప్ లేకున్నా విడాకుల కోసం ఫస్ట్ మోషన్ దాఖలు చేయొచ్చని ఢిల్లీ HC తాజాగా పేర్కొంది. ప్రతి కపుల్ ఏడాది వేరుగా ఉండాల్సిన అవసరం లేదన్న ఈ కామెంట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ సొంత జీవితాల్లో త్వరగా ముందుకు వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందని పలు యువ జంటలు పేర్కొన్నాయి. అయితే డివోర్స్ను మరింత ప్రోత్సహించే ప్రమాదముందన్నది సీనియర్ సిటిజన్స్ ఆందోళన.
News December 20, 2025
394 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి B.Tech, BE, డిప్లొమా, ITI ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 – 26 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.iocl.com *మరిన్ని ఉద్యోగాలకు <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 20, 2025
ఇండియా దెబ్బ.. పాకిస్థాన్ దొంగ ఏడుపు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ ప్రభావం ఇప్పుడు పాక్లో కనిపిస్తోంది. నీటి కొరత తీవ్రంగా ఉండటంతో పాక్ డిప్యూటీ PM ఇషాక్ దార్ మొసలి కన్నీళ్లు కార్చారు. భారత్ ఉద్దేశపూర్వకంగా సింధు జలాల ఒప్పందాన్ని బలహీనపరుస్తోందని, తమ దేశ ప్రజలు దాహంతో చనిపోయే ప్రమాదం ఉందన్నారు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దేశానికి ఇదే సరైన సమాధానమని పలువురు అంటున్నారు.


