News October 18, 2024

కెనడాలో బలమైన భారతీయ సమాజం

image

కెనడాలో 28 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 18 లక్షల భారత సంతతివారు, 10 లక్షల మంది ప్రవాసులు ఉన్నారు. వాంకోవర్, టొరంటో, మాంట్రియల్, విన్నీ పెగ్, ఒట్టావా ప్రాంతాల్లో అధికంగా జీవిస్తున్నారు. అక్కడ చదివే విదేశీ విద్యార్థుల్లో 45 శాతం మంది భారతీయులే. అక్కడి పథకాల్లో ప్రధాన లబ్ధిదారులూ మనవాళ్లే. 2019లో కెనడా వెళ్లిన భారతీయుల సంఖ్య 2.46 లక్షలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 28 లక్షలకు చేరుకుంది.

Similar News

News October 18, 2024

IPL: ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునేది వీరినేనా?

image

ఐపీఎల్ ప్లేయర్ల రిటెన్షన్లకు సంబంధించి ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
MI: రోహిత్, బుమ్రా, సూర్య, హార్దిక్
DC: పంత్, అక్షర్, జేక్/కుల్దీప్, PBKS: అర్ష్‌దీప్
LSG: పూరన్, మయాంక్ యాదవ్, బదోని/మోహ్సిన్
CSK: జడేజా, రుతురాజ్, దూబే, ధోనీ
GT: గిల్, రషీద్, SRH: కమిన్స్, అభిషేక్, క్లాసెన్
RR: శాంసన్, పరాగ్, జురెల్
KKR: శ్రేయస్, రసెల్, నరైన్
RCB: కోహ్లీ, డుప్లెసిస్, సిరాజ్

News October 18, 2024

STOCK MARKETS: ఫైనాన్స్, బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్

image

దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. FIIలు వెళ్లిపోవడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఎర్లీ ట్రేడ్‌లో సెన్సెక్స్ 80,764 (-233), నిఫ్టీ 24,595 (-54) వద్ద ట్రేడవుతున్నాయి. నిన్న సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొన్న ఆటో షేర్లు నేడు పుంజుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్‌ను ఇన్వెస్టర్లు అక్యూములేట్ చేసుకుంటున్నారు. INFY, BPCL, TITAN టాప్ లూజర్స్.

News October 18, 2024

రేపు భారత్, పాకిస్థాన్ మ్యాచ్

image

ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024 టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుండగా, <<14354965>>ఇండియా-A<<>> తన తొలి మ్యాచులో రేపు పాక్‌-Aతో తలపడనుంది. ఒమన్ వేదికగా రేపు రా.7కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో భారత్, పాక్, శ్రీలంక, అఫ్గాన్, బంగ్లా జట్లు తమ A టీమ్‌లను బరిలోకి దింపగా, UAE, ఒమన్, హాంకాంగ్ తమ సీనియర్ జట్లను ఆడిస్తున్నాయి. ఈ మ్యాచులను ఫ్యాన్‌కోడ్ యాప్‌లో చూడవచ్చు.