News March 17, 2024

పది పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు : ఎస్పీ

image

అనకాపల్లి జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కేవీ మురళీకృష్ణ శనివారం తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పక్కాగా అమలయ్యేలా పోలీస్ అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు.పరీక్షా కేంద్రాలు వద్ద జన సమూహాలు ఉండకూడదన్నారు.

Similar News

News December 9, 2025

విశాఖలో ఆయిల్ పామ్ సాగుకు 100% రాయితీ

image

విశాఖ జిల్లాలో 100 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉద్యాన అధికారిణి శ్యామల తెలిపారు. రైతులకు 100% రాయితీపై మొక్కలు, అంతర పంటల నిర్వహణకు రూ.21,000 సాయం, డ్రిప్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇది 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం ఇస్తుందని, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల రైతులు ఆర్‌బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News December 8, 2025

జీవీఎంసీలో అడ్డగోలు ప్రతిపాదనలు వెనక్కి..!

image

జీవీఎంసీలో అభివృద్ధి పనులపై 287 అంశాలకు గాను 34 అంశాలను స్థాయి సంఘం ఆమోదం తెలపకూండా శనివారం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలకు ఆమోదం విషయంలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయ్యారంటూ స్థాయి సంఘం సభ్యులపై వార్తలు రావడంతోనే వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చర్చ సమయంలో కొందరు అధికారుల తప్పిదాలకు తాము విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుందని స్థాయి సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసు సైతం వ్యాఖ్యానించారు.

News December 8, 2025

విశాఖ: డిసెంబర్ 21న పల్స్ పోలియో

image

ఈ నెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో పై అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ 100 శాతం పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో 2,09,652 మంది ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్నారని 1062 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు.