News January 8, 2025
కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత: జగన్
AP: కార్యకర్తలను వేధించిన వారిని చట్టం ముందు నిలబెడతామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కార్యకర్తలను ఇప్పటివరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని చెప్పారు. జెండా మోసిన వారందరికీ భరోసాగా ఉంటామన్నారు. ఇవాళ తాడేపల్లిలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత రావడానికి కనీసం ఏడాదైనా పడుతుందని కానీ ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు.
Similar News
News January 9, 2025
సంక్రాంతి: ఫాస్టాగ్ చెక్ చేసుకోని బయల్దేరండి!
సంక్రాంతి పండక్కి స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ నెలకొనే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా ఫాస్టాగ్ పని చేస్తుందో లేదో చెక్ చేసుకుంటే మంచిది. కేవైసీ చేయించకపోయినా, మినిమం బ్యాలెన్స్ లేకున్నా బ్లాక్ లిస్టులో పడి, వాహనం ముందుకు కదలదు. అప్పటికప్పుడు రీఛార్జ్ చేసినా యాక్టివేట్ అయ్యేందుకు 15 నిమిషాల టైమ్ పడుతుంది.
>>SHARE IT
News January 9, 2025
తిరుమల తొక్కిసలాట.. తప్పెవరిది?
AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. ఈ ఘటనలో తప్పెవరిది అనేదానిపై చర్చ జరుగుతోంది. టికెట్లు దొరకవేమోనన్న కంగారుతో భక్తులు ఒక్కసారిగా తోపులాడుకోవడం వారి తప్పు. ఒకేసారి గేట్లు తెరవడం పోలీసుల తప్పు. టికెట్ల జారీపై నిర్దిష్ట ప్రమాణాలు పాటించకపోవడం, ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే అంచనా వేయలేకపోవడం టీటీడీ తప్పు అని చర్చ జరుగుతోంది.
News January 9, 2025
అంతా కేటీఆర్ చెప్పినట్లే చేశాం..
TG: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో KTR చెప్పినట్లే తాము చేశామని IAS అర్వింద్ కుమార్, BLN రెడ్డి విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అర్వింద్‌ను ఏసీబీ, రెడ్డిని ఈడీ నిన్న ప్రశ్నించాయి. విదేశీ కంపెనీకి నేరుగా నిధులు చెల్లిస్తే సమస్యలొస్తాయని చెప్పినా తాను చూసుకుంటానని ఆయన అన్నారని అర్వింద్ చెప్పినట్లు సమాచారం. రేసింగ్ వ్యవహారంలో తాను నిమిత్తమాత్రుడినేనని రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.